TS నుంచి TG.. కలెక్షన్లు అదుర్స్‌?

తెలంగాణ ప్రభుత్వం వాహనాల రిజిస్ట్రేషన్‌ కోడ్‌ ను ఇటీవల టీఎస్‌ నుంచి టీజీకి మార్చింది. అయితే.. టీఎస్ నుంచి టీజీగా మారి కేవలం ఐదు రోజులు మాత్రమే అవుతుంది. ఈ ఐదు రోజుల్లోనే రోజుకి సుమారు కోటి రూపాయలకు పైగా రవాణా శాఖకు ఆదాయం సమకూరుతుంది. గత ఐదు రోజుల్లో ఫ్యాన్సీ నంబర్లతో రవాణా శాఖ రూ.5కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఈ లెక్కలు ఓసారి చూస్తే.. హైదరాబాద్ జిల్లాకు అత్యధికంగా రెండు కోట్ల రూపాయలు, ఆదిలాబాద్ కు 6లక్షల రూపాయలు, భద్రాద్రికి రూ.11లక్షలకు పైగా, హనుమకొండకు రూ.11లక్షలకు పైగా, జగిత్యాలకు రూ.6లక్షలకు పైగా కలెక్షన్స్ వచ్చాయి.

అలాగే జనగాంకు రూ.2లక్షల వరకు, జయశంకర్ జిల్లాకు లక్ష రూపాయలు, జోగులాంబకు రూ.3లక్షలకు పైగా, కామారెడ్డికి రెండున్నర లక్షలకు పైగా, ఖమ్మంకు రూ.18లక్షలకు పైగా, ఫ్యాన్సీ నంబర్లతో ఆదాయం వచ్చింది. ఇంకా కరీంనగర్ కు 13లక్షలకు పైగా, కొమురంభీంకు లక్ష రూపాయల వరకు, మహబూబ్ నగర్ కు నాలుగున్నర లక్షలకు పైగా, మహబూబాబాద్ కు లక్షన్నర రూపాయలకు పైగా, మంచిర్యాలకు నాలుగున్నర లక్షలకు పైగా ఫ్యాన్సీ నంబర్ల ద్వారా ఆదాయం సమకూరింది.

మెదక్ కు రెండున్నర లక్షలకు పైగా, మేడ్చల్ మల్కాగ్ గిరీకి రూ.64లక్షలకు పైగా, ములుగు జిల్లాకు 80వేలకు పైగా, రంగారెడ్డికి రూ.85లక్షలకు పైగా, సంగారెడ్డికి రూ.41లక్షలకు పైగా ఇలా ప్రతి జిల్లాలోనూ ఫ్యాన్సీ నంబర్లు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. గడిచిన ఐదు రోజుల్లో ఫ్యాన్సీ నంబర్లకు ఫీజు రూపంలో దాదాపు రెండున్నర కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చేసింది. అలాగే బిడ్ ధర మరో రెండున్నర కోట్ల రూపాయల వరకు మొత్తం కలిపి ఐదు కోట్ల రూపాయలకు పైగానే ఆదాయం సమకూరినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కలు ఓసారి చూస్తే.. టీఎస్‌ నుంచి టీజీకి మార్చడం కాస్త కలసి వచ్చినట్టుగానే కనిపిస్తోంది కదా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: