పొత్తుల కోసం చంద్రబాబు తిప్పల వెనుక?

బండ్లు ఓడలవుతుంటాయి.. ఓడలు బండ్లు అవుతుంటాయనేది సామెత. ఇది రాజకీయ నాయకులకు సరిగ్గా సెట్ అవుతుంది.  గతంలో చక్రం తిప్పిన నాయకులు సైతం ఒక్కసారి ఓటమి పాలైతే.. వారిని కనీసం పట్టించుకునే వారే ఉండరు. తాజాగా తెలంగాణలో కేసీఆర్ పరిస్థితిని మనం గమనిస్తే.. ఇదే విషయం మనకు అవగతం అవుతుంది. ఒకప్పుడు థర్డ్ ఫ్రంట్ అన్న కేసీఆర్ ఇప్పుడు బీఎస్పీతో పొత్తు  పెట్టుకున్నారు.

ఇది పక్కన పెడితే.. చంద్రబాబు నాయుడు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేత. ఒకప్పుడు ఆయన ఆడిందే ఆట. ప్రధాన మంత్రిగా ఎవరుండాలో కూడా ఆయనే నిర్ణయించారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన కూటమికి ఆయన నాయకత్వం కూడా వహించారు. ప్రధానిగా దేవ గౌడను, గుర్జాల్ ను ఖరారు చేసింది కూడా చంద్రబాబే అని చెబుతుంటారు. ఆ రోజుల్లో దిల్లీలో అడుగు పెడితే మీడియా మొత్తం ఆయన వెన్నంటే ఉండేది.

అప్పుడు మాట్లాడే ప్రతి చిన్నమాట జాతీయ స్థాయిలో ప్రచురితం అయ్యేవి. టీడీపీ నాయకులకు ఇదే ఒక గౌరవం. మా నాయకుడు ఇంతటి చరిత్ర ఉంది అని చెప్పుకుంటూ ఉంటారు. ఉమ్మడి ఏపీలో టీడీపీ స్థాపించిన క్రమంలో కాంగ్రెస్ నాయకులు దిల్లీ వెళ్లి చేతులు కట్టుకొని నిల్చొంటారు. వారి భవిష్యత్తు హస్తినలో ఉంటుంది.. వాళ్లు అపాయిట్ మెంట్ ఇస్తేనే రాష్ట్రంలో కార్యకలాపాలు కొనసాగుతాయి అని ఆరోపించేవారు.

ఇప్పుడు సీన్ కట్ చేస్తే  జగన్ ను ఓడించేందుకు తమ జట్టులోకి రావాలని బీజేపీ ని చంద్రబాబు కోరారు. ఈ విషయమై ఆయన మూడు రోజుల పాటు దిల్లీ లోనే ఉండి బీజేపీ అగ్రనేతల పిలుపు కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. ఆయన జీవితంలో ఇలాంటిది ఊహించి ఉండరు. గతంలో 2014 సమయంలో పొత్తు పెట్టుకున్నా ఆయన నేరుగా ఇన్వాల్వ్ కాకుండా బీజేపీ నేతలనే ఇక్కడకి రప్పించి మాట్లాడి అంతా ఓకే అయిన తర్వాత రంగంలోకి దిగారు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. ఆయనే దిల్లీ వెళ్లి పడిగాపులు కాసి.. పొత్తును కుదుర్చుకోవాల్సి వచ్చింది. దీనిని టీడీపీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: