‘మన శంకర వర ప్రసాద్ గారు’లో మెరిసిన నటి సాయి ప్రియా రెడ్డి
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా ఫిబ్రవరి 11 నుంచి జీ5 తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసింది. 350 కోట్లకు పైగా రాబట్టి రీజనల్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అలాంటి చిత్రంలో కనిపించిన పాత్రకి ఆడియెన్స్ రియాక్ట్ అయ్యారు. ప్రతీ కారెక్టర్‌కి కనెక్ట్ అయ్యారు. ఇక ఈ సినిమాలో ఆరంభం నుంచి చివరి వరకు ఓ సీరియల్ నడుస్తుంది. ఆ సీరియల్ హీరోయిన్‌గా సౌమ్య పాత్రలో మెప్పించింది.
మన శంకర వర ప్రసాద్ కారెక్టర్‌లో చిరంజీవి ఆ సీరియల్ గురించి, ఆ సీరియల్‌లోని పాత్రల గురించి చెబుతూ ఉండటం.. అతని జీవితాన్ని రిప్లెక్ట్ చేస్తున్నట్టుగా ఆ సీరియల్ సాగడం.. ఇలా ఆ ట్రాక్ ఎంత ఫన్నీగా వర్కౌట్ అయిందో చెప్పాల్సిన పని లేదు. ఆ సీరియల్‌లో కనిపించిన నటికి కూడా ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. సోషల్ మీడియాలో సదరు నటి కోసం అందరూ వెదుకులాట ప్రారంభించేశారు.
సినిమాలోని సీరియల్‌లో సౌమ్య పాత్రలో నటించిన ఆమె పేరు సాయి ప్రియా రెడ్డి. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి వచ్చింది. క్షేత్రం, నందీశ్వరుడు, పూలరంగడు, రెబెల్, మిర్చి, తడాఖా, జీనియస్, లక్కీ ఇలా చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో చిత్రాల్ని చేసింది. ఆ తరువాత యూట్యూబ్‌లో సిరీస్‌లు కూడా చేసి మంచి పేరుని సంపాదించుకుంది.
రీసెంట్‌గా వచ్చిన విశ్వక్ సేన్ లైలా చిత్రంలోనూ నటించింది. అందులో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో మెరిసింది. సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉన్న బ్యూటీకి మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో మంచి పాత్ర దక్కిందని చెప్పుకోవచ్చు. ఇక ముందు ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో అవకాశాలు పెరిగేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు ప్రాజెక్టులో భాగస్వామి అయిన ట్టుగా సమాచారం.