జగన్‌పై మూకుమ్మడి దాడి.. ఎదుర్కోగలరా?

మార్చి మొదలవకముందే ఎండలు వేడెక్కాయి. ఏపీలో రాజకీయాలు ఈ వేడిని మరింత పెంచి తారాస్థాయికి తీసుకెళ్తున్నాయి. ఎవరికి వారు ప్రత్యర్థులను ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి చేయాలని చూస్తున్నారు. రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి. ఎత్తుకు పై ఎత్తులు వేసి ప్రత్యర్థులపై పై చేయి సాధించడమే ఉంటుంది. ఏ చిన్న అవకాశం ఇచ్చినా.. అవతలి వాళ్లు.. తొక్కేసి విజయం సాధిస్తారు.

దూకుడుగా వెళ్తున్న పార్టీలను డిఫెన్స్ లో పడేయడం మిగతా పార్టీల పని. పొత్తు ప్రకటించి దూకుడుగా వెళ్తున్న జనసేన, టీటీపీ కూటమి.. అభ్యర్థుల ప్రకటనతో ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయింది. ఇంత తక్కువ సీట్లు ఇచ్చారని జన సైనికులు, కాపు సామాజిక వర్గ నేతలు.. ఆపార్టీకి అన్ని సీట్లు ఇచ్చి తమకు కోత పెట్టారని టీడీపీ సీనియర్ నేతలు నొచ్చుకోవడం మొదలు పెట్టారు. వీరిని బుజ్జగించి.. సముదాయించే పనిలో చంద్రబాబు ఉన్నారు.

కానీ ఈ కూటమికి పవర్ ఫుల్ మీడియా అండ ఉంది కాబట్టి ఎలాంటి అసంతృప్తి లేదని.. అంతా సవ్యంగా సాగుతుందనే ఒక భావన్ను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దీనిని డైవర్ట్ చేసేందుకు వైసీపీలో గందరగోళాలు ఉన్నాయనే విషయాన్ని ప్రస్తావిస్తూ వస్తోంది. వైసీపీ అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని భావించిన సమయంలో ఒక్కసారిగా చంద్రబాబు గేర్ మార్చారు.  దీంతో ఒక్కసారిగా వైసీపీ డిఫెన్స్ లో పడిపోయింది.

వైఎస్ వివేకా హత్య కేసు గురించి ఆమె కూతురు, జగన్ సోదరి దిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి.. మా అన్నకు ఓటేయ్యెద్దు అని ప్రకటించారు. దీంతో హూ కిల్లిడ్ బాబాయ్ అనే నినాదాన్ని చంద్రబాబు ఎత్తుకున్నారు. దీంతో ఒక్కసారిగా వైసీపీ మంత్రులందరూ.. దీనిని ప్రతిఘటించే విషయంపై ఫోకస్ పెట్టారు. ఇప్పుడు మళ్లీ తాజాగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ.. ఈ సారి ఏపీలో జగన్ గెలవరు అంటూ సంచలన ప్రకటన చేశారు. దీంతో ఒక్కసారిగా వైసీపీ సోషల్ మీడియా.. అనుకూల మీడియా.. వైసీపీ సీనియర్ నాయకులు, మంత్రులు పీకేకు కౌంటర్ ఎటాక్ ఇవ్వడం ప్రారంభించారు. ఎన్నికల్లో దూకుడుగా వెళ్తున్న వైసీపీ ఈ రెండు అంశాలతో ఒక్కసారిగా వెనుకపడిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: