పొత్తులపై మోడీ, చంద్రబాబు తేల్చేస్తారా?

టీడీపీ అధినేత చంద్రబాబు దిల్లీ వెళ్లి అమితా షా తో భేటీ అయిన తర్వాత రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం ఊపందుకుంది. పొత్తులపై జాతీయ నాయకత్వం నేటికి ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. పొత్తులో బీజేపీకి కేటాయించే సీట్లపై చంద్రబాబు తన అనుకూల మీడియా, సోషల్ మీడియా ద్వారా లీకులు ఇస్తూ వస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం సైతం పొత్తుల ప్రచారానికి ఊతమిస్తూ.. పొత్తులపై జాతీయ నాయకత్వానిదే తుది నిర్ణయం అంటూ ప్రకటిస్తూ వస్తోంది.

ఇదిలా ఉండగా రాష్ట్రంలో 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని భావించి.. అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను బీజేపీ అధిష్ఠానానికి రాష్ట్ర నేతలు పంపారు. ప్రతి లోక్ సభ నుంచి ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున.. ప్రతి అసెంబ్లీ బరి నుంచి ముగ్గురికి తక్కువ కాకుండా పేర్లతో నివేదికను సిద్ధం చేసి దిల్లీకి పంపారు.

అయితే చంద్రబాబు అమాయకుడేం కాదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం బీజేపీలో ఏం జరుగుతుందో అంతా ఆయనకు తెలుసు. బీజేపీతో పొత్తు కావాలి. కానీ అది ఆయన అనుకున్నట్లు జరగాలి. ఆ పొత్తు ఎందుకు అవసరం అంటే.. జగన్ ను కట్టడి చేసేందుకు ఎలా అంటే ఆయన ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా ఉండాలి. దానికి అధికార బలం కావాలి. ఎన్నికల్లో వైసీపీని పోల్ మేనేజ్ మెంట్ చేయనివ్వకుండా తనకు అండగా ఉండాలి. ఇది బీజేపీతోనే సాధ్యం.

దిల్లీ బీజేపీలో, రాష్ట్ర పార్టీలో ఏం జరుగుతుందో అంతా చంద్రబాబుకి తెలుసు. తనపై బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుందని భావించి.. 94 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేశారు. తద్వారా మీరు వస్తే పొత్తు ఉంటుంది. లేకపోతే ఒంటరిగా అయినా ఎన్నికలకు వెళ్తాం అనే సంకేతాలను కాషాయ అగ్ర నేతలకు పంపారు. తాను ప్రకటించిన దానికి కౌంటర్ గా ఇప్పుడు బీజేపీ అభ్యర్థుల ఎంపిక చేపట్టింది అని ఆయనకు తెలుసు. అందుకే ఆయన సైలెంట్ గా ఉన్నారు. తన పని తాను చేసుకుపోతున్నారు. తాజాగా ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు. ఈసారి ఏం సాధించుకుని వస్తారో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: