జగన్‌ సంచలన మార్పులు.. మంచి చేస్తాయా?

ఇక మార్పులు లేవంటూనే వైసీపీలో పెద్ద ఎత్తున మార్పులు జరుగుతున్నాయి. అభ్యర్థులను మార్చుతూ వైసీపీ తొమ్మిదో జాబితాను విడుదల చేసింది. పార్టీ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో సమావేశం అయిన జగన్ ఇక్కడి నుంచి అభ్యర్థులు మార్పు ఉండదని.. ఎక్కడికక్కడే పేర్లు ప్రకటించి సిట్టింగులు, ఇన్ఛార్జిలు ఎన్నికల బరిలో దిగుతారని తేల్చి చెప్పారు.  దీంతో దాదాపు 75మంది సిట్టింగులను మార్చినట్లు అయింది.

మళ్లీ తాజాగా తొమ్మిదో జాబితా విడుదల చేసి అందరికీ షాక్ ఇచ్చింది. వై నాట్ 175లో భాగంగా గతంలో సీట్లు కేటాయించిన వారిని సైతం మార్చేస్తోంది. తాజా జాబితాలో భారీ మార్పులు ఉంటాయని అంతా భావించారు. కానీ రెండు అసెంబ్లీ, ఒక లోక్ సభ స్థానానికి మాత్రమే మార్పులు చేశారు. నెల్లూర్ లోక్ సభ ఇన్ ఛార్జిగా విజయసాయి రెడ్డి పేరును ప్రకటించింది. మంగళగిరి అసెంబ్లీ ఇన్ఛార్జిగా మురుగుడు లావణ్య, కర్నూల్ కి ఇంతియాజ్ లను ఖరారు చేసింది.

నెల్లూరు ఎంపీగా విజయసాయిరెడ్డి బరిలో దిగడం అనివార్యంగా మారింది. అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ప్రభాకర్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నియమించారు. కానీ నెల్లూరు సిటీ అభ్యర్థి విషయంలో తన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోలేదని ఆయన మనస్తాపానికి గురై టీడీపీ లో చేరేందుకు సిద్ధం అయ్యారు. మరోవైపు ఇక్కడ విజయసాయి రెడ్డి అల్లుడు శరత్ చంద్రరెడ్డి పేరు వినిపించినా చివరకు అధిష్ఠానం విజయసాయినే ఖరారు చేసింది.

దీంతో పాటు అనూహ్యంగా మంగళగిరి లో అభ్యర్థిని మార్చుతూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని తప్పించి… గంజి శ్రీనివాస్ ను ఎంపిక చేశారు. దీంతో ఆళ్ల కాంగ్రెస్ లో చేరి.. తిరిగి సొంత గూటికి మళ్లీ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో గంజి శ్రీనివాస్ స్థానంలో మురుగుడు లావణ్యను ఎంపిక చేశారు. టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి యూటర్న్ తీసుకోవడంతో గంజి శ్రీనివాస్ ఎటువైపు మొగ్గు చూపుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: