తెరపై డాల్ రియల్ లైఫ్‌లో మాస్ ఫైటర్! కృతి శెట్టి హర్రర్ స్టోరీ...!

Amruth kumar
టాలీవుడ్‌లో తన క్యూట్ లుక్స్‌తో, డ్యాన్స్‌తో యువతను ఆకర్షిస్తున్న బ్యూటీ కృతి శెట్టి.. తెరపై ఎంత హుషారుగా ఉంటుందో, బయట అంత బోల్డ్‌గా ఉంటుంది! తాజాగా, ఒక ఇంటర్వ్యూలో ఆమె పంచుకున్న మాస్ ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ సంచలనం సృష్టిస్తోంది. తాను ఒక హోటల్ రూమ్‌లో ‘ఆత్మ’ ను చూశానని, ఆ సమయంలో ఏం జరిగిందో ఆమె చెప్పిన తీరు చూస్తుంటే గూస్‌బంప్స్ రావడం ఖాయం!కృతి శెట్టి తన సినిమా ప్రమోషన్స్ కోసం ఒక సిటీకి వెళ్లినప్పుడు ఈ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఆమె ఒక హోటల్ రూమ్‌లో బస చేయగా.. ఆ రూమ్‌లో భయంకరమైన వైబ్రేషన్స్, నెగెటివ్ ఎనర్జీని ఫీల్ అయ్యారట ..



ఆత్మను చూసిన కృతి: అర్ధరాత్రి సమయంలో ఆ రూమ్‌లో ఒక అదృశ్య శక్తి (ఆత్మ) ఉందని కృతికి స్పష్టంగా తెలిసిందట. ఆ సమయంలో ఆమె ఏమాత్రం భయపడకుండా, తన బోల్డ్ యాటిట్యూడ్‌తో దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు.‘మాస్’ ధైర్యం: చాలా మంది అమ్మాయిలు ఇలాంటి సంఘటనల్లో భయపడిపోతారు. కానీ, కృతి శెట్టి మాత్రం ఆ నెగెటివ్ వైబ్రేషన్స్‌ను ఎదుర్కొంటూ.. మానసికంగా బలంగా నిలబడింది. “ఆ సమయంలో నాచురల్‌గా నాలో ఒక పవర్ వచ్చింది. ఆ శక్తిని (ఆత్మను) రూమ్ నుంచి బయటకు పంపేంత వరకు నేను భయపడలేదు!” అని కృతి చెప్పడం ఆమె మాస్ ధైర్యంకు నిదర్శనం . .!


ఈ అనుభవాన్ని కృతి శెట్టి పంచుకున్న తర్వాత.. ఆమె ధైర్యాన్ని, ఆ సంఘటనను చూసి ఫ్యాన్స్ షాక్‌కు గురవుతున్నారు. “కృతి శెట్టి ధైర్యం వేరే లెవల్!”, “ఆత్మకే రివర్స్ షాక్ ఇచ్చింది మా బ్యూటీ!” అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి, తెరపై క్యూట్‌గా కనిపించే కృతి శెట్టి ... రియల్ లైఫ్‌లో ఎంత మాస్ ఫైటర్ అనేది ఈ సంఘటనతో మరోసారి రుజువైంది .!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: