బలం లేదా? మరి పదేళ్లు ఏం చేసినట్టు పవన్‌?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమా హీరోగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చారు.  ప్రస్తుతం కూడా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. అందువల్లే ఆయన సాధారణ రాజకీయ నేతలకు భిన్నంగా ఆలోచిస్తారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. వాటిని సమానంగా స్వీకరించాలి. ఓటమి నుంచి గెలుపును తీసుకోవాలి. కానీ ఆయన జగన్ ఓటమిలోనే తన గెలుపును వెతుక్కుంటూ అక్కడే ఆగిపోతున్నారు.  అధికారం చేపట్టేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదనేది విశ్లేషకులు అభిప్రాయం.

తాజాగా చూసుకున్నట్లయితే.. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఆ పార్టీ జనసేనకి 24 సీట్లు కేటాయించింది. దీనిపై ఆ పార్టీ నేతలతో పాటు కాపు సంఘం నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు. కనీసం పావు వంతు సీట్లు కూడా లేవని.. వీటితో పవర్ షేరింగ్ ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. వీటికి బదులుగా పవన్ మనకి అసలు బూత్ కమిటీలు ఎక్కడ ఉన్నాయి. పోల్ మేనేజ్ మెంట్ మనం ఎలా చేస్తాం? మనకి బలమైన అభ్యర్థులు లేనే లేరు. ఎక్కువ సీట్లు తీసుకొని వైసీపీకి లబ్ధి చేకూర్చలేం. కాబట్టి మన బలం ఆధారంగా 24 తీసుకున్నాం అని సెలవిచ్చారు.

అయితే పవన్ జనసేన స్థాపించి దాదాపు పదేళ్లు కావొస్తొంది. కానీ ఇప్పటి వరకు పార్టీని సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇప్పుడేమో మన పార్టీకి బూత్ కమిటీలే లేవు. బలమైన అభ్యర్థులు లేరు అంటూ చెబుతున్నారు. 2019 ఎన్నికల సమయంలో అన్ని నియోజకవర్గాల నుంచి బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా అధ్యక్షులకు ఆదేశాలు ఇచ్చారు. చాలా చోట్ల నియోజకవర్గాల నుంచి లిస్ట్ లు కూడా తీసుకున్నారు. తీరా చూస్తే కమిటీలను ఏర్పాటు చేయలేదు. అంటే పార్టీలో చేరేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదా.. తనకు తానే మన పార్టీకి బలం లేదు అని చెప్పుకుంటున్నారా.. పార్టీలోకి వచ్చిన నేతలను సమన్వయం చేసుకోకుండా పవన్ కల్యాణే ఒంటెద్దు పోకడలతో పార్టీకి నష్టం చేకూర్చారు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: