జగన్ దెబ్బతో ఒక్కసారిగా మారిన రాజకీయాలు?
రాబోయే 30 ఏళ్లు నేనే సీఎం. అంటూ గతంలో ప్రకటించిన జగన్ వచ్చే ఎన్నికలకు అంతే పకడ్బందీగా సిద్ధం అవుతున్నారు. ఎడాపెడా మార్పులు, ఆపరేషన్ ఆకర్ష్, సోషల్ ఇంజినీరింగ్, ఎవరూ ఊహించని విధంగా అభ్యర్థుల ఎంపికలో కొత్త పంథా, ఇలా సకల అస్త్రాలతో సీఎం జగన్ సిద్దం అవుతున్నారు. విపక్షం వీటిపై దృష్టి సారించే క్రమంలో తాను ఏపీ ని చుట్టేస్తూ తన పని తాను కానిస్తునన్నారు. టీడీపీకి బలం బీసీలు. అదే బీసీలను 2019లో ఆ పార్టీకి దూరం చేయడంలో జగన్ విజయవంతం అయ్యారు.
ఇప్పుడు కూడా బీసీలను తన వైపు తిప్పుకునేందుకు జగన్ భారీ ప్లానే వేశారు. ఇప్పటి వరకు 70 నియోజకవర్గాలకు సమన్వయకర్తలను మార్చిన సీఎం ఎక్కువగా మార్చింది బీసీలనే. ప్రస్తుతం జగన్ పన్నిన వ్యూహాలకు బిత్తరపోవడం చంద్రబాబు వంతవుతోంది. అందుకే పొత్తు లేనిదే జగన్ ను ఢీకొట్టడం అసాధ్యం అని ఆయన భావిస్తున్నారు. దీని కోసమే బీజేపీతో బంధం నిలబెట్టడానికి పవన్ ని పావుగా వాడుకొని కొంతమేర విజయవంతం అయ్యారు.
మరోవైపు కోట్లాది మెగా అభిమానులు.. బలమైన కాపు సామాజిక వర్గం అండగా ఉన్నా కూడా సొంతగా గెలవలేనని తెలిసే పవన్ కల్యాణ్ చంద్రబాబుతో పొత్తుకు సిద్ధమయ్యారు. కేంద్రంలో ఈ సారి మోదీ రావడం పక్కా అని బలంగా నమ్ముతున్న బీజేపీ ఏపీకి వచ్చే సరికి ప్రభావం చూపలేకపోవడానికి కారణం జగనే. ముగ్గురు కలిస్తే తప్ప జగన్ ని ఎదుర్కోలేని పరిస్థితిని సృష్టించిన జగన్ ఏపీ రాజకీయాలను మార్చేశారు అంటే వాస్తవమే కదా. ఇది జగన్ శక్తా.. లేక విపక్షాల బలహీనత అనేది ఆలోచించాలి.