ఏపీ: బాబు వస్తేనే పరిశ్రమలు వస్తాయా?

ఏపీలో రాజకీయ ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు, జగన్ లు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీల కంటే దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఓ వైపు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తూనే మరోవైపు ప్రచారం వైపు దృష్టి సారించారు. గత కొద్దీ రోజులుగా సిద్ధ పేరుతో సభలు నిర్వహిస్తున్నారు. ఐదేళ్లలో తమ ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరిస్తూ.. సంక్షేమ పథకాల లబ్ధి గురించి ప్రస్తావిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

ఈ క్రమంలో అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ సిద్ధం సభ నిర్వహించింది. ఈ సభకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ కు పలు ప్రశ్నలు సంధించారు. రాప్తాడు అడుగుతోంది జాకీ పరిశ్రమను ఎందుకు తరమివేశారని.. అనంత అడుగుతోంది కియా అనుబంధ పరిశ్రమలు ఏమి అయ్యాయని.. రైతన్న అడుగుతున్నాడు నాటి డ్రిప్ పథకాలు ఎక్కడని సమాధానం చెప్పి సభ పెడతావా అంటూ జగన్ ను ట్యాగ్ చేస్తూ చంద్రబాబు పోస్టు చేశారు.

అయితే జాకీ పరిశ్రమను 2017లోనే ప్రారంభించాలని టీడీపీ నిర్ణయించి కోట్ల విలువైన భూములను లక్షలకు అప్పజెప్పంది. 2019 వరకు పరిశ్రమకు సంబంధించిన పనులే ప్రారంభించలేదు. మరోవైపు పరిటాల కుటుంబం కోట్ల విలువైన భూమిపై కన్నేసిందని అందుకే పరిశ్రమ పేరుతో దానిని చౌక ధరలకే కొనుగోలు చేశారని వైసీపీ ఆరోపిస్తోంది.

టీడీపీ హయాంలో పది హేను రోజులకోసారి ఐటీ కంపెనీలకు శంకుస్థాపనలు జరిగాయి అని చెబుతున్నారు. ఇప్పుడా కంపెనీలు అన్నీ ఏం అయ్యాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రముఖ కంపెనీలు అయిన ఇన్ఫోసిస్, మైక్రో సాఫ్ట్ లేక మరేదైనా బడా కంపెనీలు వచ్చాయా అని అడుగుతున్నారు. ఇలా వచ్చిన పెద్ద కంపెనీలు ఏం వెళ్లిపోయాయో చెప్పాలని లెక్కలు అడుగుతున్నారు. మధ్య తరగతి కి అర్థం కానీ విధంగా జగన్ వస్తే పరిశ్రమలు రావు.. చంద్రబాబు వస్తే ఇవన్నీ వస్తాయి అనే ప్రచారాన్ని మాత్రం జనాల్లోకి చాలా తెలివిగా చంద్రబాబు తీసుకెళ్తున్నారు అని విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: