ఎన్నికల్లోనూ టెక్నాలజీ వాడుతున్న చంద్రబాబు?

ఉమ్మడి ఏపీకి సాంకేతికతను అందించింది నేనే అని చంద్రబాబు చెబుతూ ఉంటారు. అలాగే మీడియా కూడా ఆయన్ను హైటెక్ సీఎం అని రాస్తూ ఉంటారు.  ఈ పేరుకు తగ్గట్లుగానే ఆయన కూడా పలు రకాల కార్యక్రమాలనూ చేపడుతూ వచ్చే వారు. ఇప్పుడు కూడా ఆయన ఎన్నికల్లో గెలిచేందుకు అలాంటి హైటెక్ వ్యూహాన్నే పన్నుతున్నారు.

ఏంటంటే.. ప్రతి నియోజకవర్గంలోని ప్రజలకు తెలుగుదేశం తరఫున కొన్ని ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి. ఈ నంబరు ను ట్రూ కాలర్ లో వెతికినా టీడీపీ అనే వస్తోంది. అలా వచ్చిన ఫోన్ కాల్ లో నేను మీ చంద్రబాబుని మాట్లాడుతున్నారు.  మీ నియోజకవర్గంలో ఎవరైతే గెలుస్తారు. అంటూ టీడీపీ ఆశావహుల పేర్లు ఒక్కరైతే ఒక్కరు.. అంతకుమించి పేర్లు ఉంటే వాళ్లందరికీ చెబుతున్నారు. అభ్యర్థుల పేర్లు చెబుతున్నారు. ఇందులో మీ అభ్యర్థికి ఓ నంబరు నొక్కండి. నచ్చకపోతే నోటాకి నొక్కండి అంటూ ఓ నంబరు సూచిస్తున్నారు.

ఇద్దరికి మించి ఉంటే వీరిలో ఎవరు మంచి అభ్యర్థి. ఎవరైతే గెలుస్తారు అంటూ అడుగుతున్నారు. ఉదాహరణకు చెప్పాలంటే మైలవరం తీసుకుంటే దేవినేని ఉమామహేశ్వరావు అయితే ఒకటి నొక్కండి. వసంత కృష్ణ ప్రసాద్ అయితే రెండు నొక్కండి. బొమ్మసాని సుబ్బారావు కావాలనుకుంటే మూడు నొక్కండి అంటూ ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి. ఈ ముగ్గురి పేర్లు నచ్చకపోతే నోటా ను ఎంచుకోండి అంటూ  ఓ నంబరు ను చెబుతున్నారు.

ఇది ఆషామాషీగా చేసే ఫోన్ కాల్ కాదు. ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థుల పేర్లు ఎంచుకొని పార్టీ కార్యకర్తలతో పాటు నియోజకవర్గంలోని ఓటర్లకు ఫోన్ చేసి వారి అభిప్రాయాన్ని తెలుసుకుంటున్నారు. వీళ్లలో ఎక్కువ శాతం ఓట్లు పొందిన వారినే పార్టీ అభ్యర్థిగా నిలబెడతామని చంద్రబాబు చెబుతున్నట్లు తెలుస్తోంది. తన వెంట ఉండి నాలుగు మంచి మాటలు చెప్పిన వారికి కాకుండా ప్రజల అభిప్రాయాలను తీసుకొని అభ్యర్థిని నిర్ణయించడం అనేది ప్రజాస్వామ్య బద్ధమైన అడుగు అని విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: