సినీ ఇండస్ట్రీలో విషాదం.. స్టార్ హీరో తండ్రి మృతి..!

Divya
బాలీవుడ్ లో ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరో సిద్ధార్థ మల్హోత్రా గురించి చెప్పాల్సిన పనిలేదు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, ఏక్ విలన్, షేర్ షా,మిషన్ మజ్ను, యోధ, పరం సుందరి తదితర చిత్రాలలో నటించి బాగా గుర్తింపు సంపాదించారు. తాజాగా సిద్ధార్థ్ మల్హోత్ర తండ్రి మరణించినట్లుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా సిద్ధార్థ్ మల్హోత్ర తండ్రి సునీల్ మల్హోత్ర అనారోగ్యంతో బాధపడుతూ ఫిబ్రవరి 14వ తేదీన తుది శ్వాస విడిచారు .అయితే ఈ విషయాన్ని సిద్ధార్థ్ మల్హోత్రా సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. నాలుగు రోజుల క్రితమే ఇది జరిగినప్పటికీ సిద్ధార్థ్ మల్హోత్ర తన తండ్రి గురించి పోస్ట్ తెలియడంతో ఈ విషయం తెలిసింది.


ముఖ్యంగా తండ్రి గురించి తెలియజేస్తూ ఆయన క్రమశిక్షణ నిజాయితీ విలువలకు మారుపేరు.. ఆయనకు కాలం ఎన్ని పరీక్షలు పెట్టినా కూడా వాటిని చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారు. గత కొంతకాలంగా పక్షవాతం కారణంగా ఆయన వీలు చైర్ కే పరిమితమైన ఎప్పుడూ కూడా తన ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. చివరకు ఏ బాధ లేకుండా నిద్రలోనే శాశ్వతంగా కన్నుమూశారని తన తండ్రి గురించి ఒక ఎమోషనల్ నోట్ రాసుకోచ్చారు సిద్ధార్థ్ మల్హోత్ర . తాను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి తన తండ్రి ప్రోత్సాహమే కారణమంటూ తెలియజేశారు.



సిద్ధార్థ్ మల్హోత్ర  తండ్రి గతంలో నేవీలో కెప్టెన్ గా పనిచేశారు. ఆయన మరణ వార్త వినగానే అటు బాలీవుడ్ ప్రముఖులతో పాటు సిద్ధార్థ్ అభిమానులు కూడా ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. తన తండ్రితో కలిసి ఉన్న కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారింది.  సిద్ధార్థ్ మల్హోత్ర భార్య కియారా అద్వాని అన్న సంగతి అందరికీ తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: