తెలంగాణ బీజేపీ తలరాతను ఆ పత్రిక మార్చేసిందా?

కారుతో కమలం దోస్తీ ఉంటుంది. ఇప్పటికే దిల్లీ స్థాయిలో మంతనాలు జరుగుతున్నాయి. కేసీఆర్ తన సంకేతాలు పంపారు. త్వరలో ఏదైనా జరగొచ్చు. అమిత్ షా పొత్తుల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయోద్దని పార్టీ నేతలకు సూచించారు. ఈ నేపథ్యంలో త్వరలో కమలం పార్టీతో పొత్తు కు సంబంధించి ఛాయిస్ కేసీఆర్ చేతిలో లేదు. అందువల్లే ఆయన మౌనంగా ఉన్నారు.

ప్రస్తుతం బీఆర్ఎస్, మజ్టిస్, బీజేపీకి 54 మంది సభ్యుల మద్దతు ఉంది. కాంగ్రెస్ సభ్యులు పక్క చూపులు చూస్తే ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఇవీ ఆదివారం నాటి కొత్త పలుకులో ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ రాసిన కొత్త పలుకులు. అయితే ఆర్కే చంద్రబాబు పై చూపించే ప్రేమ ఏ రాజకీయ నాయకుడు లేదా అతని కుటుంబ సభ్యులు చూపించరు అనిపిస్తూ ఉంటుంది.

చంద్రబాబుకి శత్రువులు అయితే ఆయన తన వ్యాసాల్లో పుంఖానుపుంఖాలు వాళ్ల గురించి విమర్శలు చేస్తుంటారు. ఇప్పుడు తాజాగా ఆయన రాసిన కొత్త పలుకు లో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు అని రాశారు. తెలంగాణలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని ప్రచారం చేశారు. ఫలితం ప్రజలు కూడా నమ్మి తటస్థ ఓటర్లందరూ కాంగ్రెస్ వైపు మళ్లారు. దీంతో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది.

ఇప్పుడు కూడా ఎన్డీయే కూటమిలో చేరేందుకు టీడీపీ తహతహలాడుతోంది. పొత్తు ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండాలి కదా. కానీ తెలంగాణలో మేం ఒంటరిగా బరిలో దిగుతాం అని టీ బీజేపీ నేతలు తేల్చి చెబుతున్నారు. కానీ బీఆర్ఎస్ తో కాషాయ అగ్ర నేతలు చర్చలు సాగిస్తున్నారు అని ఆర్కే రాసుకొచ్చారు. ఈ మాటలు మళ్లీ లోక్ సభ ఎన్నికలపై చూపే అవకాశం లేకపోలేదు.  బీజేపీ బలహీన పడితే టీడీపీ అవసరం మాకు ఉందని కాషాయ నేతలు భావిస్తారు కాబట్టి అని ఈ తరహా ప్రచారానికి ఆయన తెర లేపారని విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: