వైసీపీ గెలుపు భారం అంతా జగన్‌పైనేనా?

ఏపీలో ఎన్నికల సమరం హోరాహోరీగా మారుతోంది. యుద్ధానికి పార్టీలు సిద్ధం అంటున్నాయి. సీఎం జగన్ అభ్యర్థుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరింది. జగన్ ఇప్పటికే ఎన్నికలకు కేడ్ ను సిద్ధం చేసేన క్రమంలో పలు భారీ బహిరంగ సభలు నిర్వహించారు. మరోవైపు టీడీపీ, జనసేన కూటమి లో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ వైఖరి పైన మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

అయితే ఏపీలో వైనాట్ 175 నినాదంతో జగన్ ముందుకు వెళ్తున్నారు. తాను చేసిన సంక్షేమం రాష్ట్రంలో 83 శాతం మందికి అందిందని చెప్పుకొచ్చారు. ఆ సంక్షేమంతో పాటుగా అమలు చేసిన సామాజిక న్యాయం తన ఎన్నికల అస్త్రాలుగా భావిస్తున్నారు. మంచి జరిగితేనే తనకు ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు. ప్రతిపక్షాలకు ఓట్లు వేస్తే పథకాల రద్దుకు ఆమోదం చెప్పినట్టేనని నినదిస్తున్నారు.

అయితే ఇప్పటికే దాదాపు జగన్ తన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు. 75 స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. 17 మంది ఎంపీలను ప్రకటించారు. ప్రతిపక్షాలు పొత్తులతో వస్తున్నాయని తాను సింగిల్ గానే వస్తున్నానని స్పష్టం చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా జగన్ తన సైన్యాన్ని నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. ఆ మేరకు జగన్ తన శక్తినంతా కూడదీసుకొని కష్టపడుతున్నారు. కార్యకర్తలు మాత్రం ఎక్కడా రోడ్డెక్కడం లేదన్నట్లు కనిపిస్తోంది.  ఇంకా పార్టీలో శషబిషలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఎమ్మెల్యే అభ్యర్థులు మారినా.. సీఎం మాత్రం జగనే కదా. కార్యకర్త, నియోజకవర్గ ఇన్ఛార్జి మధ్య సమన్వయం లేకపోతే జగన్ ఎంత కష్టపడినా ప్రయోజనం ఏంటని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  ఈసారి ఓడితే వైసీపీ మళ్లీ కోలుకోవడం కష్టం. అంతలా చంద్రబాబు ఆ పార్టీని దెబ్బతీస్తారు. దీనిని గుర్తించి వైసీపీ కార్యకర్తలు జగన్ నాయకత్వాన్ని సమర్థిస్తూ తమ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకుంటారా.. లేక ఇళ్లకే పరిమితం అవుతారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: