షర్మిల- రేవంత్‌.. నీళ్ల పంచాయతీ తేలుస్తారా?

తెలుగు రాష్ట్రాల మధ్య జల యుద్ధం మొదలైంది. ఈ వివాదాన్ని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తెస్తోంది. ఏపీలోని జగన్ సర్కారు కు మేలు చేసేలా కేసీఆర్ నాడు నిర్ణయాలు తీసుకున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరిగిందో వివరిస్తూ ఏకంగా అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తున్నారు. కృష్ణానది ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగించే ప్రసక్తే లేదని రేవంత్ సర్కారు స్పష్టం చేస్తోంది.

ఇదిలా ఉండగా ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. వైఎస్సార్టీపీ ని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీసీసీ అధ్యక్షురాలిగా షర్మిళ బాధ్యతలు చేపట్టారు. చేపడుతూనే తన సోదరుడు వైఎస్ జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్ర విభజన హక్కులు సాధించడంలో జగన్ విఫలం అయ్యారని.. విమర్శిస్తున్నారు. ఆంధ్రాకి నీళ్లు తీసుకురాలేదని.. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

కానీ తెలంగాణ అసెంబ్లీలో మాత్రం జగన్ తెలంగాణకు అన్యాయం చేసి నీటిని తరలించుకుపోయారు అని మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు అందరూ విమర్శిస్తున్నారు. పోలింగ్ రోజున ఏపీ సర్కారు నాగార్జున సాగర్ పై దండయాత్ర చేసి తమ పరిధిలోకి వచ్చే గేట్లంటూ వాటిని ఎత్తి నీటిని విడుదల చేసుకున్నారు. తద్వారా నీటి విషయంలో జగన్ లబ్ది పొందారనే ఆరోపణలున్నాయి.

అయితే విభజన హామీలపై పీసీసీ అధ్యక్షురాలు షర్మిళ తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే జల జగడం జరుగుతుంది. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో ఏపీకి ప్రయోజనం చేకూర్చేలా కేసీఆర్ వ్యవహరించారని నాడు ఆరోపించారు. ఇంకా పలు రకాల విమర్శలు చేశారు. ఇప్పుడు ఏమో తన అన్న ఏపీకి ఏం చేయలేదు అని చెబుతున్నారు. మరోవైపు సొంత పార్టీ నేతలేమో సీఎం జగన్ తెలంగాణకు అన్యాయం చేసి ఏపీకి నీటిని తరలించుకుపోయారని చెబుతున్నారు. మరి ఇప్పుడు షర్మిళ ఏపీకి ఎలాంటి మేలు జరిగేలా చేయలేదు. ఇంకా ఏపీకి అన్యాయమే జరిగింది అని సీఎం రేవంత్ రెడ్డికి చెప్పాలని పలువురు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: