అమిత్‌షా డిమాండ్‌: జనసేనకు 50.. బీజేపీకి 25?

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నకొద్దీ.. విపక్షాల పొత్తులపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. దిల్లీ నుంచి గల్లీ దాకా వరుస భేటీలు, చర్చోపచర్చలు జరగుతున్నా టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ ఎంట్రీపై స్పష్టత రావడం లేదు. అదిగో.. ఇదిగో అనే మాటే ఎక్కువగా వినిపిస్తోంది. దీనిపై రకరకాల ఊహాగానాలు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి.

ఇంతకీ పొత్తు ఉన్నట్లా లేనట్లా అన్నది మాత్రం ఎవరూ నోరు మెదపడం లేదు. చంద్రబాబు సైతం క్లారిటీ ఇవ్వడం లేదు. అసలు చంద్రబాబు అమిత్ షా తో ఏం చర్చించారు అన్నది ఊహాజనిత ప్రశ్నగా మిగిలిపోతుంది. దీనిపై ఎల్లో మీడియా సైతం క్లారిటీ ఇచ్చే ప్రయ్నతం చేయకపోవడం విశేషం. కానీ పొత్తు మాత్రం ఖాయం అనే సంకేతాలను పార్టీ శ్రేణుల్లోకి పంపిస్తున్నారు. తద్వారా సీట్ల త్యాగానికి సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు.

అయితే ఎవరికి అనుకూలంగా వారు ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో సోషల్ మీడియా లో ఓ ప్రచారం నడుస్తోంది. చంద్రబాబు అమిత్ షాను కలిసిన తర్వాత ఎందుకు సైలెంట్ అయ్యారు అనే దానిపై నిజమా, అబద్ధమా అనేది ఎవరికీ తెలియదు. సినిమాకు ముందు ఈ చిత్రంలోని సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే అన్న మాదిరిగా ఇవన్నీ ఊహజనితాలే. వాస్తవాలు చంద్రబాబుకి, అమిత్ షాకి, పవన్ కల్యాణ్ కి తప్ప మరెవరకీ తెలియదు.

ఈ పోస్టు సారాంశం ఏంటంటే.. పొత్తు ఖరారు కావాలంటే బీజేపీ ఓ ఫార్ములా ప్రతిపాదించింది.  ప్రతి పార్లమెంట్ పరిధిలో టీడీపీకి నాలుగు, బీజేపీకి రెండు, జనసేనకు ఒక అసెంబ్లీ స్థానం కేటాయించాలని సూచించింది అంట. ఒకవేళ ఇది కొంచెం తారు మారు అయినా అంటే జనసేనకు రెండు, బీజేపీకి ఒక స్థానం అడిగే అవకాశం ఉంది. దీనిద్వారా మిత్ర పక్షాలకు మొత్తం 75 సీట్లు ఇవ్వాలి. 12 నుంచి 13 పార్లమెంట్ స్థానాలు ఇవ్వాలి. మరి ఇది వాస్తవమా కాదా త్వరలో తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: