వైసీపీ ఏడో జాబితా.. ఎన్ని సంచలనాలో?

వైసీపీ ఇప్పటికే అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల కోసం 6 జాబితాలు ప్రకటించింది. ఇప్పటి వరకూ 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండి చేయి చూపారు. అలాగే 8 మంది సిట్టింగ్ ఎంపీలపై వేటు వేసేశారు. అంతే కాదు.. మరికొంత మంది సిట్టింగ్ లపై వేటు వేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. ఇందు కోసం ఏడో జాబితా రెడీ అవుతోంది. మార్పులు చేయనున్న నియోజక వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు తాడేపల్లి నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది. సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వడంతో ఎమ్మెల్యేలు నేతలు సీఎం జగన్ ను కలిశారు.

ప్రకాశం జిల్లాకు సంబంధించి పలు నియోజకవర్గాల్లో మార్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయానికి వచ్చారు. తన కుమారుడిని ఒంగోలు అసెంబ్లీ నుంచి పోటీ చేయించేందుకు బాలినేని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఒంగోలు ఎంపీగా పార్టీ దాదాపుగా నిర్ణయించిన చెవిరెడ్డి భాస్కర రెడ్డి అభ్యర్థిత్వాన్ని బాలినేని వ్యతిరేకిస్తున్నారు. పార్టీ అధిష్టానం మాత్రం చెవిరెడ్డిని తప్పించేది లేదని స్పష్టం చేస్తోంది. అవసరమైతే తానే ఒంగోలు ఎంపీగా పోటీ చేసేందుకు సిద్దమని బాలినేని కూడా ప్రతిపాదన పెట్టారట.

ఇవే కాకుండా పలు అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై కొనసాగుతోంది. టీడీపీ నుంచి ఎన్నికై వైసీపీ వైపుకు జంప్ కొట్టిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. ఇటీవల సీఎం జగన్ ను కలసి తన సీటు విషయమై చర్చించారు.  గుడివాడ ఎమ్మెల్యే  కొడాలి నాని కూడా సీఎంను కలసి పలు అంశాలపై చర్చించారు. కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ను మార్చాలని యోచిస్తోన్న సీఎం.. ఆయన స్థానంలో కర్నూలు  మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి  అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నారు. టికెట్ కోల్పోయిన కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్ యాదవ్ సీఎం జగన్ ను కలసి తనకు ఎక్కడో ఓ చోట  టికెట్ ఇచ్చి  న్యాయం చేయాలని కోరారు. ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని జగన్ ఏడో జాబితా రూపొందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: