ఇక ఆ చట్టాన్ని బీజేపీ దేశమంతా తీసుకువస్తుందా?

ఉత్తరాఖండ్ రాష్ట్రం చరిత్రాత్మక నిర్ణయానికి వేదికైంది. స్వాతంత్ర్యానంతరం దేశంలోనే ఉమ్మడి పౌర స్కృతిని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. యూసీసీ బిల్లుకు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఉమ్మడి పౌర స్కృతి చట్టాన్ని అమలు చేయనున్న తొలిరాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. ఇక నుంచి ఆ రాష్ట్రంలో మతాలకు అతీతంగా పౌరులందరికీ ఒకే తరహా వివాహ, విడాకుల, భూమి, ఆస్తి, వారసత్వ చట్టాలు వర్తిస్తాయి.

సహ జీవనంలో పుట్టిన పిల్లలకు కూడా చట్టపరమైన గుర్తింపు కల్పించడం.. సహ జీవనాన్ని రిజిస్టర్ చేసుకోకపోతే ఆరు నెలల జైలు శిక్ష వంటి అంశాలను ఈ బిల్లులో పొందుపరిచారు. అలాగే షెడ్యూల్డ్ తెగలను ఈ బిల్లు పరిధి నుంచి తప్పించారు. ఇదిలా ఉంటే యూసీసీ బిల్లు రూప కల్పనలో అక్కడి బీజేపీ ప్రభుత్వం రాజకీయ విమర్శలు ఎదుర్కొంది. విపక్షాల ఆందోళన నడుమ ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీ దీనిని ప్రవేశ పెట్టారు.

ఆపై గందరగోళ పరిస్థితుల నడుమ సభ వాయిదా పడగా.. చివరకు చర్చ జరపిన అనంతరం ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్ లో బిల్లుకు అనుకూలంగా మెజార్టీ సభ్యులు మద్దతు పలకడంతో ఆమోదం లభించింది. స్వాతంత్ర్యానంతరం దేశంలోనే ఉమ్మడి పౌర స్కృతి అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. దేవంలో గోవాలో పోర్చుగీసు పాలన నుంచి ఉమ్మడి పౌర స్కృతి ఉంది.

ఇదిలా ఉంటే యూసీసీని ఉత్తరాఖండ్ బీజేపీ 2022 ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చేర్చింది. అధికారంలోకి రాగానే సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రెండేళ్ల పాటు సుదీర్ఘ కసరత్తులు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 70కి పైగా సమావేశాలు నిర్వహించింది. 60వేల మందితో మాట్లాడింది. ఆన్ లైన్లో వచ్చిన 2.33లక్షల సలహాలు, సూచనలు పరిశీలించి.. అనంతరం ముసాయిదాను రూపొందించి ఇటీవల సీఎంకు సమర్పించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: