అంతమాట అంటున్నాడు..ఏంటి జగన్‌ ధైర్యం?

ఏపీలో ఎన్నికలు దగ్గరకొచ్చాయి. వైసీపీ, టీడీపీ వ్యూహాలకు పదును పెట్టాయి. అయితే.. టీడీపీ, జనసేన కలిసి వచ్చినా మళ్లీ తామే అఖండ మెజారిటీతో గెలుస్తామంటున్నారు సీఎం జగన్. అసెంబ్లీలో ప్రసంగిస్తూ.. ప్రజలందరి చల్లని దీవెనలతో మళ్లీ మూడు నెలలకు ఇదే చట్టసభలో పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టి అఖండ మెజారిటీతో ప్రజల మన్ననలు పొందుతానని సీఎం వైయస్‌ జగన్‌ ధీమా వ్యక్తం చేశారు.

2014 ఎన్నికల గురించి గుర్తు తెచ్చుకుంటూ.. ఆ ఎన్నికల ముందు మనం కూడా రూ.87 వేల కోట్లు రైతుల రుణాలు మాఫీ చేద్దామని చాలా మంది అన్నారని.. అందరూ నా శ్రేయోభిలాషులే అన్నారని.. అయితే చేయలేనిది చెప్పకూడదు..మాట ఇస్తే తప్పకూడదని ఆ రోజు చెప్పానని జగన్ గుర్తు చేసుకున్నారు.ఆ ఒక్క రోజు నేను అధర్మం చేయని కారణంగా ఒక్క శాతం ఓటు తేడాతో ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చున్నానని.. ఒక్క అబద్ధం చెప్పి ఉంటే ఆ రోజు జగన్‌ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునేవాడినని.. ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చున్నానని జగన్ అన్నారు.

ఈ రోజు కూడా నాకు రిగ్రేట్‌ లేదంటున్న జగన్.. నేను వెనక్కి వెళ్లి మళ్లీ అబద్ధం చెప్పనని.. నా నోట్లో నుంచి అబద్ధాలు రావన.. నేను ఆ రోజు చేసిన పని వల్ల అధికారంలోకి రాకపోవచ్చు కానీ ప్రజల్లో విశ్వసనీయత అన్న పదానికి అర్థం జగనే అని ప్రజలు నమ్మారని జగన్ అంటున్నారు. ఈ ఐదేళ్లలో చెప్పిన మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేశాను. ప్రతి ఇంటికి మేనిఫెస్టోను తీసుకెళ్లి ప్రజల ఆశీస్సులు కోరుతున్నాన్న సీఎం జగన్... ఇదీ మనకు చంద్రబాబుకు ఉన్న తేడా అన్నారు.

చంద్రబాబు రకరకాలుగా మోసాలు చేశారని.. అందుకే కేవలం 23 స్థానాల్లో ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని.. మాట మీద నిలబడ్డాం కాబట్టే.. డే వన్‌ నుంచి నిబద్ధత చూపించాం కాబట్టే 151 స్థానాలు ఇచ్చారని.. ఆ తరువాత జరిగిన ప్రతి ఎన్నికల్లో ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుని వైయస్‌ఆర్‌సీపీని గెలిపించారని జగన్ అన్నారు. విశ్వసనీయత అన్నది ఎప్పటికైనా గెలుస్తుందని.. ఫలాని వ్యక్తి నమ్మకస్తుడు అని సంపాదించుకోవాలంటే కొంత మందికి సంవత్సరాలు పడుతుందని  జగన్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: