జగన్ సోషల్ ఇంజినీరింగ్ వర్కవుట్‌ అవుతుందా?

వైసీపీ అభ్యర్థుల ఆరో జాబితా వెల్లడించారు. ఇప్పటి వరకు ఐదు జాబితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ 60 అసెంబ్లీ స్థానాల్లో సిట్టింగ్ లను మార్చారు. తాజాగా ఆరో జాబితాలో మరో పది మందికి స్థాన చలనం కల్పించారు. అయితే పక్కా సామాజిక వ్యూహంతోనే జగన్ ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గంతో పాటు బీసీలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం విశేషం.

అయితే జగన్ సోషల్ ఇంజినీరింగ్ తప్పా.. ఒప్పా అనేది ప్రజలు తేల్చేయబోతున్నారు. ఎందుకుంటే కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్నచోట బీసీలకు లేదా కాపులకు కేటాయిస్తున్నారు. అలాగే  రాజు సామాజిక వర్గం తమదేనంటూ చెప్పుకునే చోట బీసీలకు ఇవ్వడం లాంటి వి చేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే బీసీలకు ఈ స్థాయిలో సీట్లు ఇవ్వడం ఆంధ్ర రాష్ట్రంలోనే తొలిసారని నిపుణులు పేర్కొంటున్నారు.

బీసీల పక్షపాతిగా చెప్పుకునే చంద్రబాబు కూడా ఇంత మొత్తంలో బీసీలకు సీట్లు కేటాయించలేదని చెబుతున్నారు.  ఏయే కులాలకు ఎక్కడ ఎంతమంది ఓటర్లు ఉన్నారో లెక్కగట్టి జగన్ సోషల్ ఇంజినీరింగ్ కు పాల్పడుతున్నారు. సాధారణంగా కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలు ఆ తర్వాత కాపులు ఈ మూడు కులాల ఆధారంగా సుమారు 70 ఏళ్లపాటు సాగిన రాజకీయాలను ఒక్కసారిగా మార్చేస్తున్నారు సీఎం జగన్.

పూర్తి రివర్స్ లో ఈ సారి ఎన్నికలకు వెళ్తున్నారు. దీనికి తోడు తాను.. తన పరిపాలన అనే అజెండాతో ముందుకు వెళ్తున్నారు. నా వల్ల మంచి జరిగితేనే ఓటు వేయండి అని ధైర్యంగా ఓట్లు అడుగుతున్నారు. ఇది ఓ పక్క సంతోషంగా.. సంబురంగా మాట్లాడుతున్న వైసీపీ నాయకులు లోలోపల మాత్రం ఆందోళన చెందుతున్నారు.  ఎందుకంటే ఓసీలు రూ.కోట్లకు కోట్లు ఖర్చు పెట్టే నాయకులు ఉన్న చోట కూడా జగన్ ఆస్థాయిలో ఖర్చు చేయలేని బీసీలనే నిలబెడుతున్నారు.  మరోవైపు వ్యక్తి కంటే కూడా పార్టీ పేరుతోనే ముందుకు వెళ్తున్నారు.   మరి ఇది ఏ మేరకు లబ్ధి చేకురుస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: