కృష్ణా బోర్డుకు పగ్గాలు.. జగన్‌ విజయమా?

ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయినా ఇంకా జల వివాదం నడుస్తూనే ఉంది. నవంబరులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏపీ సీఎం జగన్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్దకు తమ పోలీసులను పంపించి.. ఏపీకి చెందిన గేట్లంటూ నీటి విడుదల  చేసుకున్నారు. దీంతో కేంద్రం ఒక్కసారిగా అప్రమత్తమై డ్యాం నిర్వహణను తమ ఆధీనంలోకి తీసుకుంది. రెండు రాష్ట్రాల మధ్య నీటి  సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర జలశక్తి సమావేశాలు నిర్వహించింది.

ఫలితంగా కృష్ణా నది ప్రధాన ప్రాక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్ ల నుంచి రెండు రాష్ట్రాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) నీటిని విడుదల చేయనుంది. ఈ మేరకు హైదరాబాద్ లో కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయంలో బోర్డు ఛైర్మన్ శివ్ నందన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి.  ఇక నుంచి రెండు రాష్ట్రాలకు నీటిని విడుదల చేసే కాంపొనెంట్లను బోర్డు నిర్వహిస్తోంది.  

ఇది తాత్కాలికమే. ఇష్టం వచ్చినట్లు నీటిని తీసుకోవడంతో పాటు ప్రాజెక్టుల వద్ద రోజుకో గొడవ ఉండదు. ఇకపై నీటి విడుదల బోర్డు చేపడుతుంది. దీనికి అనుగుణంగా రాష్ట్రాలు సిబ్బందిని కేటాయిస్తాయి. కృష్ణా బోర్డుకు ఈ అవుట్ లెట్ల అప్పగింతపై ఏపీ ఏనాడో జీవో జారీ చేసింది. కానీ తెలంగాణ ముందుకు రాలేదు. అవసరం అయితే శ్రీశైలం ప్రాజెక్టు కూడా కేంద్ర బలగాలకు అప్పగించాల్సి ఉంటుంది.

ఇంత వరకు తీసుకురావడంతో ఏపీ సీఎం జగన్ విజయవంతం అయినా.. టీఎస్ సీఎం రేవంత్ రెడ్డి ఓ కొత్త మెలిక పెట్టారు. అదేంటంటే సాగు నీటి ప్రాజెక్టు లు కేంద్రానికి అప్పగిస్తాం కానీ.. పవర్ ప్రాజెక్టులు మాత్రం బోర్డు పరిధిలో ఉండొద్దని కోరారు. తెలంగాణ చేతిలో జల విద్యుత్ ఉత్పత్తి ఉంటే కరెంట్ తయారీ పేరుతో ఆ నీళ్లను వాడుకుంటుంది. ఇది ఆంధ్రాకి నష్టం కలిగిస్తుంది. మరి దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: