జగన్‌ ఆ హాట్‌ కామెంట్స్‌.. షర్మిల గురించేనా?

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన ప్రసంగాల్లో వాడీ వేడీ పెంచుతున్నారు. తాను స్పందించాలనుకున్న ఏ విషయాన్ని అయినా ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో చెప్పి తీరుతున్నారు. ఈ క్రమంలో ప్రత్యర్థులకు వారు రియాక్ట్ అవ్వలేని రేంజ్ లో చురకలు అంటిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిళపై కూడా జగన్ తన మార్క్ చురకలు అంటించారు.

ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే షర్మిళ వైసీపీ సర్కారు పై, జగన్ పై నేరుగా విమర్శలు గుప్పించారు. ఏపీలో అభివృద్ధే జరగలేదని విమర్శించారు. దీంతో మైకుల ముందుకు వచ్చిన వైసీపీ నేతలు అభివృద్ధి అంటే ఏమిటో చెప్పే ప్రయత్నం చేశారు. తమతో వస్తే జరిగిన అభివృద్ధిని చూపిస్తామంటూ తెలియజేశారు. ఈ సమయంలో ప్రస్తుతం అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్ ఆసరా నిధుల జమ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా స్టార్ క్యాంపెయినర్స్ అంటూ వరుస పెట్టి వాయించే పనికి పూనుకున్నారు. పవన్, పురంధేశ్వరి లతో పాటు పరోక్షంగా షర్మిలకు కూడా చురకలు అంటించారు.

చంద్రబాబు ఏ మంచి పని చేయకున్నా ఆయనకు చాలా మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారన్నారు. కొంత మంది పక్క రాష్ట్రాల నుంచి వచ్చారని.. రాష్ట్రాన్ని విభజించిన పార్టీలో కూడా చేరారని షర్మిలను ఉద్దేశించి అన్నారు. దీంతో పాటు కొంతమంది బీజీపీలో తలదాచుకున్నారని వీరంతా చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్లు అని ఎద్దేవా చేశారు.

అంతటితో ఆగకుండా జెండాలు జత కట్టడమే వారి అజెండా అని.. ప్రజల గుండెల్లో గుడి కట్టడమే తన అజెండా అని చమత్కరించారు. పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత షర్మిళ జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సరిగ్గా ఇదే సమయంలో సోదరుడు జగన్ అనంతరపురంలో సౌండ్ చేశారు. షర్మిళను టార్గెట్ చేసుకొని కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి అయితే అన్నా చెల్లెలి మధ్య గట్టి పోరాటం ఉంటుందని ఇరువురు సంకేతాలు పంపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: