ఆ దేశాల మధ్య యుద్ధం ముదురుతోంది?

ఇటీవలే పాకిస్థాన్ సరిహద్దుల్లో దాడులు చేసిన ఇరాన్.. మరింత దూకుడు ప్రదిర్శిస్తోంది. తిరిగి పాకిస్థాన్ దాడి చేసినప్పటికీ ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. దీంతో మధ్య ఆసియా దేశాల పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ఇరాన్ దాడులు మరిచిపోకముందే యోమెన్ పైకి అమెరికా దాడికి దిగింది. ఆ ప్రాంతంలో హౌతీ తిరుగుబాటు దారులు ఉన్నారని ఆరోపిస్తూ అక్కడి వారి స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది.

అమెరికా కు బ్రిటన్ వంటి దేశాల సహకారం తోడు కావడంతో మరింత దూకుడుగా దాడులు చేస్తోంది. సముద్ర మార్గాన్ని ముఖ్యంగా తమకు వాణిజ్య అవసరాలు తీర్చే వస్తువులను తీసుకువస్తున్న నౌకలను లక్ష్యంగా చేసుకొని ఇబ్బంది పెడుతున్న హౌతీ రెబల్స్ పై అమెరికా ప్రతీకారాన్ని తీర్చుకుంటుంది.  హౌతీ రెబెల్స్ పై అమెరికా దాడులను నిరసిస్తూ ఇరాన్ కూడా కాలు దువ్వుతోంది. ఏకంగా అమెరికా పై దాడులు చేస్తోంది. ఇరాక్ లో ఉన్న అమెరికన్ కాన్సలేట్ కార్యాలయ భవనంపైకి ఇరాన్  బాలిస్టిక్ మిస్సైల్ ను సంధించింది. ఇరాక్ ఉత్తర ప్రాంతంలోని ఏర్బిల్ సిటీలో ఉన్న అమెరికా కాన్సులేట్ భవనాన్ని ఇరాన్ లక్ష్యంగా చేసుకొని దాడులు చేసింది.

ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ఆరుగురు గాయపడ్డారు. అయితే ఈ దాడులు జరిగిన వెంటనే ఇరానియన్ రెవెల్యూషనరీ గార్డ్ కార్స్డ్ స్పందించింది. ఆ దాడికి తామే కారణమని ప్రకటించింది.  అంతేకాదు ఏర్బిల్ సిటీలోని కాన్సులేట్ కార్యాలయాన్నిగూడ చర్యగా కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారిందని ఆరోపించింది. తమకు వ్యతిరేకంగా పాశ్చాత్య దేశాలు ఏకమవుతున్నాయని తమను ఇబ్బంది పెట్టడానికి ఆ దేశాల మద్దతును అమెరికా కూడ గట్టుకుంటోందని ధ్వ జమెత్తింది.

ఇక ఇరాన్ మిలిటెంట్లు కూడా రెచ్చిపోయి దాడులకు దిగారు. ఇరాక్ లోని అమెరికా ఎయిర్ బేస్ పై ఏకంగా భీకరమైన దాడులు చేశారు. ఈ ఘటనలో అమెరికా సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.  అయితే ఈ దాడి వెనుక ఇరాన్ మిలిటెంట్ గ్రూపులు ఉన్నాయని అమెరికా భావిస్తోంది.  హౌతీ తిరుగుబాటు దారులపై దాడులు చేస్తున్న అమెరికా ఇరాన్ తమపై చేసిన దాడులను ఏ విధంగా తిప్పికొడుతోంది? దీనివల్ల మధ్య ఆసియా ప్రాంతంలో చేసుకుంటున్నాయి.. ఇవి యుద్ధానికి దారి తీస్తాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

war

సంబంధిత వార్తలు: