ఈ వైసీపీ సర్వే లెక్కలు నిజమవుతాయా?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు అటు రాజకీయ నాయకులు ఇటు ఏపీ ప్రజలు సిద్ధం అవుతున్నారు. ఈ సారి ఎన్నికలు చాలా  రసవత్తరంగా మారేలా కనిపిస్తున్నారు. అధికార పార్టీలో ఉన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి గెలుపు ఖాయమని ధీమాతో ముందుకు వెళ్తున్నారు. అయితే అధికార పార్టీని ఓడించాలనే లక్ష్యంతో చంద్రబాబు పవన్ కల్యాణ్ లు ఇద్దరూ కూడా పలు రకాల వ్యూహాలు పన్నుతున్నారు. దీంతో ఈ  సారి ఎన్నికలు చంద్రబాబు వర్సెస్ జగన్ లా మారాయి.

ఇలాంటి సమయంలోనే ప్రముఖ సర్వే సంస్థలు కూడా పలు రకాల సర్వేలను విడుదల చేస్తూ ఉంటాయి.  ఈక్రమంలో జగన్ బృందం ఒక సైకిలాజికల్ గేమ్ ను ప్రారంభించింది. ప్రజాక్షేత్రంలో ఉన్న జగన్ ను ఎదుర్కోలేమని భావించిన చంద్రబాబు టీడీపీ , జనసేన కూటమి తో పాటు బీజేపీని, కాంగ్రెస్ తో పాటు వామపక్షాలను కలుపుకొని ఎన్నికలకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.

సీఎం గా జగన్ కు 60శాతం మద్దతు ఉన్నా.. కుల సమీకరణాలు, ఇతర అంశాలు, ఎమ్మెల్యేలపై వ్యతిరేకత దృష్ట్యా  అభ్యర్థులను మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతేడాది జనవరిలో గుజరాత్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 43మంది అభ్యర్థులను మార్చి విజయం సాధించింది. తెలంగాణలో కూడా కేసీఆర్ పై సానుకూల పవనాలు ఉన్నా స్థానిక ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత కారణంగా ఆ పార్టీ అధికారానికి దూరం అయింది.

కేసీఆర్ 12మందిని మారిస్తే 9మంది గెలిచారు. ఏపీలో కూడా జగన్ మూడు రకాల సర్వేలు నిర్వహించి అభ్యర్థులను మార్చుతున్నారు.  తాజాగా వైసీపీ సర్వే ప్రకారం కోస్తాలో  ఫ్యాను గుర్తుకు 50శాతం, రాయలసీమలో 55శాతం, టీడీపీకి 34శాతం, జనసేనకు 10-12శాతం, ఇతరులకు 3-4శాతం ప్రజల మద్దతు ఉంది. దిగుమ మధ్య తరగతి వర్గాల్లో బీసీ, ఎస్సీ,, ఎస్టీ వర్గాల్లో 65-70 శాతం మంది వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. కాపుల్లో జనసేనకు 50-55శాతం మంది మద్దతు ఉంది. చూద్దాం చివరకు ఎవరి లెక్కలు నిజం అవుతాయో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: