ప్రపంచాన్నే వణికిస్తున్న మత ఉగ్రవాదం?

మత రాజ్య విస్తరణ కాంక్షతో రగిలిపోయే మతోన్మాద శక్తులను పెంచి పోషించి ప్రోత్సహించిన పాపం ఇప్పుడు యూరప్ దేశాలను వెంటాడుతోంది. వాళ్లనే వణికిస్తోంది. ప్రపంచం అంతా అప్రమత్తం కాకపోతే సర్వం నాశనం అయ్యే పరిస్థితులు తాజాగా కనిపిస్తున్నాయి. చంపడం మా హక్కు. దానికి మా దేవుడు వరం ఇచ్చారు అని తీవ్రవాదులు చెబుతూ అమాయకుల ప్రాణాల బలి తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం.


లష్కరే తోయిబా, జైషే మహ్మద్ లే కాకుండా మన దేశంలో అల్లకల్లోలం సృష్టించే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. విచిత్రం ఏంటంటే వీరిని ఖండించి అంతమొందించి దేశాన్ని, ప్రపంచాన్ని కాపాడంటూ చెప్పాల్సిన నాయకులే ఉగ్రవాద సంస్థలకు మద్దతు పలుకుతున్నారు.  హౌతీలు, హమాస్ లు, హిజ్బుల్లా తీవ్రవాద సంస్థలకు కొన్ని యూరప్ దేశాలు  నిధులు సమకూర్చి ఆయుధాలు అందించి ప్రపంచ నాశనానికి కారణం అవుతున్నారు. వీరిని పెంచి పోషించింది నేరుగా ఉన్న ముస్లిం దేశాలు కాదు. మతం మారిన అటువంటి ముస్లిం దేశాలు.  ఉదా.. బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ లాంటివి.


ఈ దేశాల్లో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఇతర దేశాలపై ద్వేషంతో ఎదుగుతున్న వాటిని సర్వనాశనం చేయడమే లక్ష్యంగా తీవ్రవాదులను తయారు చేశారు. వారిప్పుడు దేశాలను ఆక్రమించుకునేందుకు విశృంఖలంగా వ్యవహరిస్తున్నారు. దీనికి సజీవ సాక్ష్యం ఎర్ర సముద్రాన్ని వారి ఆధీనంలోకి తీసుకొని ప్రపంచ దేశాలకు ఇప్పుడు సవాల్ విసురుతున్నారు.


ప్రస్తుతం ఎర్ర సముద్రం, అరేబియా సముద్రంలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న వరుస దాడులు ఉద్రిక్తలు రేపుతున్నాయి. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ రెబల్స్ వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్ కు సంబంధం ఉన్న షిప్పులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇరాన్ మద్దతుతోనే హౌతీలు రెచ్చిపోతున్నారు అని అమెరికా ఆరోపిస్తోంది. ఇప్పుడు వారు మరో అడుగు ముందుకు వేసి ఇజ్రాయెల్ దాడులు ఆపేలా ప్రపంచ దేశాలు చొరవ చూపకపోతే సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్ ని కట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికి అయినా ప్రపంచ దేశాలు అప్రమత్తం అయి తీవ్రవాదుల ఆర్థిక మూలాలను కూకటివేళ్లతో పెకిలించి వారిని సమూలంగా నిర్మూలించకపోతే మరింత నష్టం జరిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: