చంద్రబాబుకు కాంగ్రెస్ కన్నుకొడుతోందా?

ఏపీలో ఎన్నికల వేడి రోజురోజుకీ రాజుకుంటుంది. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ  జనసేన పార్టీ కలిసి సాగుతున్నాయి. అలాగే ఇవి వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో పొత్తుతో  ముందుకు వెళ్తామని చెప్పడం కూడా జరిగింది. అయితే తెలంగాణలో మొన్న జరిగిన ఎలక్షన్స్ లో జనసేనతో పొత్తు ప్రభావంతో కొన్ని సీట్లను గెలుచుకుంది భారతీయ జనతా పార్టీ. అయితే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి వస్తే గనుక ఇక్కడ భారతీయ జనతా పార్టీ కనుక తెలుగుదేశంతో కలిసి పొత్తు పెట్టుకుంటే మాత్రమే జనసేన కూడా బిజెపితో కలిసి ముందుకు వెళుతుందని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది.

భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి సాగకపోతే మాత్రం కమ్యూనిస్టులు టిడిపి తో కలిసి ముందుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. సిపిఐ ఆల్రెడీ తెలుగుదేశంతో కలిసి నడుస్తుంది. అంగన్వాడి ఉద్యమాలను సిపిఐ వెనుక ఉండి నడిపిస్తుంది అని అంటున్నారు. సిపిఎం కూడా బిజెపి గనుక టిడిపితో కలిసి రాకపోతే తాను వస్తానని అంటుందట.  కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో కలిసి సాగడానికే సిద్ధంగా ఉందని తెలుస్తుంది.

ఒకవేళ చంద్రబాబు కనుక ఐ ఎన్ డి ఐ ఏ కూటమిలోకి వస్తానంటే ఆయనను తీసుకోడానికి రెడీగా ఉంది కాంగ్రెస్ పార్టీ. దీనికి అనుకూలమైన స్టేట్మెంట్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కేంద్రంలో బిజెపి అలాగే రాష్ట్రంలో వైసిపి కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైన ప్రత్యర్థులు అని పిసిసి అధ్యక్షుడు పిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు.

డిసెంబర్ 29న కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కాకినాడలో ఏఐసీసీ సెంటినరీ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం అని మీడియా వారికి ఆయన చెప్పడం జరిగింది. ప్రతి ఇంటిపైనా, వాహనం పైనా కాంగ్రెస్ జెండా ఎగిరేలా  కార్యకర్తలు ప్లాన్ చేయాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈయన కాంగ్రెస్ కి జగన్ అలాగే బిజెపి ఇద్దరూ శత్రువులు అంటూ చంద్రబాబు నాయుడుకి ఇండైరెక్టుగా సంకేతాలు ఇవ్వడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: