జగన్పై దూకుడు పెంచిన బాబు, లోకేశ్?
అదే విధంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దాంతో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తుంది. మొన్న స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు నాయుడుని జగనే అరెస్టు చేయించారని కూడా అంటారు కొంతమంది. దీంతో వీరి మధ్య వాతావరణం మరింత వేడెక్కింది. తెలుగుదేశం పార్టీ తరపు నుండి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ జగన్ వద్ద ఏ చిన్న లూప్ హోల్ దొరికినా వదిలిపెట్టడం లేదు.
తాజాగా చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ పై విమర్శలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక మునిగిపోయే పడవని ఆయన అన్నారు. ఇక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది పైకి తేలే పరిస్థితి లేదని అంటున్నారు. 150 మంది అభ్యర్థులను మార్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే ప్రసక్తి లేదని నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.
ఐదు కోట్ల మంది జనాభాకి సైకో జగన్ కి మధ్య యుద్ధం జరగబోతుంది అంటూ ఆయన తరహాలో ఆయన కామెంట్ చేయడం జరిగింది. తెలుగుదేశం కార్యకర్తల మీద కేసుల మీద కేసులు పెడుతున్నారంటూ ఆయన చెప్పుకొచ్చారు. గెలవాల్సింది పార్టీ అభ్యర్థులు కాదని, రాష్ట్రం గెలవాలని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజా ఆమోదంతోనే తమ అభ్యర్థులకు టికెట్లు ఇస్తామని ఆయన అన్నారు. మద్యపానం నిషేధం చేయలేకపోతే తాను ఓటు అడగనని జగన్ గతంలో అన్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇలా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం జరిగింది.