కూకట్‌పల్లితో టీడీపీ, జనసేన మధ్య చెడుతుందా?
అదే సమయంలో ఆంధ్రలో మళ్లీ టీడీపీతో కలిసి జనసేన పోటీ చేసే అవకాశం ఉన్నా బీజేపీ మాత్రం చంద్రబాబుకు మాత్రం చాలా దూరంగా ఉండాలనే అనుకుంటోంది. రాజకీయాల్లో ఒక్కొ రాష్ట్రంలో ఒక్కొక్క విధానాలను జాతీయ పార్టీలు పాటిస్తుంటాయి. వాటిలో స్థానికత ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పూర్తిగా ఢీలా పడిపోయింది. అయితే తెలంగాణలో మాత్రం జనసేనకు టీడీపీ మాత్రం మద్దతు ఇస్తామని ఇప్పటి వరకు ప్రకటించలేదు.
కానీ పవన్ కల్యాణ్ మాత్రం టీడీపీ అడక్కపోయినా చంద్రబాాబు జైల్లో ఉన్నాడంటే జనసేన తమ మద్దతు ప్రకటించింది. జగన్ సర్కారును గద్దె దించేందుకు టీడీపీతో కలిసి పోటీ చేస్తామని జనసేన ప్రకటించింది. అయినా కూడా తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో ఇప్పటి వరకు కూడా జనసేనకు టీడీపీ మద్దతు ఇవ్వకపోవడం కాస్త ఆశ్చర్యానికి గురి చేసే అంశం.
కూకట్ పల్లి లాంటి స్థానంలో పోటీ చేస్తున్న జనసేనకు టీడీపీ మద్దతు అవసరం. అక్కడ నివాసముండే కమ్మ ఓట్లు గెలుపొటములను నిర్దేశిస్తాయి. కానీ ఆంధ్రలో టీడీపీకి ఎంతో మద్దతు తెలుపుతున్న కూడా పవన్ కు తెలంగాణలో సపోర్టు చేయకపోవడం వెనక ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా? ఆంధ్రలో, టీడీపీతో జనసేన పొత్తు సక్సెస్ అవుతుందా లేదా చూడాలి. లేకపోతే బెడిసి కొడుతుందా. మరో నాలుగు నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఎన్నికలు జరగనుండగా.. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.