రామాయణ, భారత పాఠాలు.. మంచిదేనా?
జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి పాఠ్య పుస్తకాల్లో రామాయణ, మహాభారతాలను సోషల్ బుక్స్ లో చేర్చాలని నిర్ణయం తీసుకుంది. ఎన్ సీఈఆర్టీ ఈ విధమైన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికిి పంపించింది. రాజ్యాంగ పీఠికను కూడా తరగతి గది గోడలపై చిత్రించాలని ఫ్యానెల్ సిఫార్సు చేసిందని ఎన్ సీఈఆర్టీ చైర్మన్ ఇసాక్ తెలిపారు. అనేక మంది విద్యార్థులకు దేశ భక్తి లోపించింది. ముఖ్యంగా ఈ తరం పిల్లల్లో చాలా మందికిి దేశం మీద ప్రేమ, గౌరవం లోపించాయి.
గతంలో లాగా కాకుండా చదువుకుని విదేశాలకు వెళ్లాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇండియాలోనే ఉండి గొప్పగా డెవలప్ అవుదామని ఆలోచన చేయడం లేదు. ముఖ్యంగా చాలా మంది విద్యార్థుల్లో ఇదే భావన కనిపిస్తుంది. ప్రతి విద్యార్థి దేశంపై ప్రేమ, జాతిపై మమకారం కలిగించేలా పాఠ్యాంశాలు ఉండేలా పాఠ్య ప్రణాళిక ఉండాలి. అదే దేశ భవిష్యత్తుకు పునాది అవుతుంది.
లేకపోతే రాబోయే కాలంలో దేశానికి ఏమైనా పర్లేదు. కానీ నాకు మాత్రం ఏమీ కాకుడదనే దోరణి కనిపించేలా ఉంది. అందుకే రామాయణ, మహాభారతాలు వ్యక్తిగా ఎలా పరిపూర్ణ జీవితాన్ని సాధించాలో చెబుతూనే వ్యవస్థలో దేశం పై ఉండే అభిమానాన్ని గౌరవాన్ని తెలియజేస్తాయి. ఈ విధంగా వారిలో మార్పు తీసుకురావచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరి ఈ విధానం అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండగా.. దీనిపై ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరం చెప్పే అవకాశం కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.