
చంద్రబాబుపై పెరుగుతున్న బీజేపీ ఆగ్రహం..?
మరోవైపు బీజేపీ సహకారంతో టీడీపీ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ మొదటి నుంచి బీజేపీ మిత్రపక్షంగానే ఉంది. కానీ 2019 ఎన్నికల్లో నరేంద్రమోదీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. చివరకి ఓటమిపాలయ్యారు. అయినా కొంతమంది తటస్థ బీజేపీ ఓటర్లు చంద్రబాబుకి అనుకూలంగానే ఉన్నారు. కానీ ప్రస్తుతం టీడీపీ అధికారికంగా చేయకపోయినా.. ఆ పార్టీ పేరుతో సోషల్ మీడియాలో బీజేపీపై విరుచుకుపడుతున్నారు. ఆపార్టీని కించపరిచేలా పోస్టులు పెడుతున్నారు.
దీంతో ఆగ్రహించిన బీజేపీ నాయకులు ఎదురుదాడికి దిగారు. ఇప్పుడా తటస్థ ఓటర్లు కూడా టీడీపీకి దూరం అవుతున్నారు. అలాంటి ఓ బీజేపీ నాయకుడు పెట్టిన పోస్టును పరిశీలిస్తే ఎన్టీఆర్ దగ్గర నుంచి చంద్రబాబు పార్టీని లాక్కున్న సమయంలో టీడీపీ అనుకూల పత్రికలు చెప్పిన మాటలకు కన్విన్స్ అయి ఆయనకు మద్దతిచ్చాం. అప్పుడు ఎన్టీఆర్ పై విమర్శలు చేపిన వారే ఇప్పుడు యుగ పురుషుడిగా చిత్రీకరించి రాజకీయంగా వాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు.
2014కి ముందు మోదీతో పొత్తు కోసం వెంపర్లాడిన చంద్రబాబు గెలిచిన తర్వాత ప్రధాని వ్యతిరేకించి తన బుద్దిని బయటపెట్టారు. ఇప్పుడు మళ్లీ రాజీ కోసం తెగ తాపత్రయ పడుతున్నారు. మరోవైపు తమ సోషల్ మీడియా ద్వారా కేంద్రంపై, నరేంద్ర మోదీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు లాంటి నేత వల్ల భవిష్యత్తు తరాలు నష్టపోయే ప్రమాద ముందని ఆయన తన పోస్టులో రాసుకొచ్చారు. ఇప్పటికి అయినా చంద్రబాబు, నారా లోకేశ్ లు బీజేపీపై పోస్టులను నియంత్రించాలి. లేకంటే టీడీపీనే నష్టపోయే ప్రమాదముంది.