తెలంగాణపై కొత్త సర్వే: సంచలన ఫలితాలు?

తెలంగాణలో  ఈ నెల 30న జరిగే ఎన్నికలకు అన్ని పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రత్యర్థుల కంటే అన్ని విషయాల్లో ముందుండేలా ఆయా పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్నికల బరిలో చాలా పార్టీలే ఉన్నా ప్రధాన పోటీ మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ఉన్నట్లు కనిపిస్తోంది. మధ్యలో బీజేపీ పోటీలోకి వచ్చినా ఆశించిన మేర సీట్లు పొందే అవకాశం లేదని తెలుస్తోంది.


అధికార బీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ పార్టీల్లో విజేత ఎవరు అనేది అంత సులువుగా తేలే పరిస్థితి కనిపించడం లేదు. సర్వే సంస్థలకు కూడా ప్రజల నాడీ చిక్కడం లేదు. అంచనాలు నిజమవుతాయి అనే ధీమా ఆయా సర్వే సంస్థల్లో కనిపించడం లేదు. ఇదిలా ఉండగా.. తాజాగా మరోసర్వే తమ ఫలితాలను వెల్లడించింది. తెలంగాణ లో తాజాగా జేజీఎం ఎం పవరింగ్ లీడర్స్ పేరుతో ఒక సంస్థ  సర్వేను నిర్వహించింది.


ఈ సర్వేలో తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగురవేయనుందని పేర్కొంది. గులాబీ పార్టీకి సుమారు 59-68 సీట్ల వరకు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీకి 37 ప్లస్ ఆర్ మైనస్ 2 సీట్లు అటుఇటుగా ఉండొచ్చంది. బీసీ సీఎం, ఎస్సీ వర్గీకరణ పేరుతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న బీజేపీకి 5-6 స్థానాలు వస్తాయంది. ఎంఐఎం అయిదు స్థానాలు ప్లస్ ఆర్ మైనస్ 2 వరకు గెలిచే అవకాశం ఉందని తమ సర్వేలో పేర్కొంది.


మరోవైపు నియోజకవర్గం వారీగా కూడా తమ సర్వే వివరాలను వెల్లడించారు. మరోవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ సాధించే సీట్ల లో మెజార్టీ  కూడా అత్యంత స్వల్పంగా ఉంటుందని అంచనా వేస్తోంది. ఏదీ ఏమైనా ఈ సారి పోటీ హోరాహోరిగా ఉన్నా..  బీఆర్ఎస్ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని తమ సర్వేలో స్పష్టం చేసింది. ప్రచారం జోరుగా సాగుతున్న ఈ  తరుణంలో ఎవరికి వారు సర్వేలు విడుదల చేసి ప్రజలను పక్కదోవ పట్టించే అవకాశం కూడా ఉందని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: