బీజేపీ రిస్కీ ప్లాన్.. వర్కవుట్‌ అవుతుందా?

1983 లో భారత్ ప్రపంచ కప్ గెలిచిన విషయం మన అందరికీ గుర్తే ఉంటుంది. కానీ భారత జట్టుపై ఆ సమయంలో ఎవరికీ అంచనాలు లేవు. అండర్ డాగ్స్ గా బరిలో దిగింది. అంటే ప్రస్తుతం అఫ్గాన్, బంగ్లాదేశ్ జట్ల మాదిరిగా. ఇండియా గెలుస్తుందని మన భారతీయుల్లో కూడా నమ్మకం లేదు. లీగ్ దశల్లో గెలుస్తూ సెమిస్ లో జింబాబ్వే తో తలపడింది. ఈ మ్యాచ్ లో కూడా భారత్ ఓటమి అంచుల వరకు వెళ్లింది. కానీ అనూహ్యంగా అప్పటి కెప్టెన్ కపిల్ దేవ్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడి 175 పరుగులతో ఆజేయంగా నిలిచి భారత్ ని గెలిపించాడు. ఫైనల్లో భారత్ గెలవడం అంతా ఓ కలలా జరిగిపోయింది. ఇప్పుడు తాజాగా తెలంగాణలో బీజేపీ కూడా అండర్ డాగ్స్ గా బరిలో దిగుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

బండి సంజయ్ సారథ్యంలో ఒకానొక దశలో బీఆర్ఎస్ కు పోటీగా నిలిచింది. అయితే బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించడం తో ఆ పార్టీ గ్రాఫ్ క్రమక్రమంగా పడిపోయింది. సింగిల్ డిజిట్ సీట్లను కూడా గెలుచుకోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కానీ వ్యూహాత్మకంగా రెండు ఎత్తుగడులు వేసింది. అందులో బీసీ జనాభా అధికంగా  ఉన్న తెలంగాణలో మేం గెలిస్తే బీసీ అభ్యర్థే సీఎం అని ప్రకటించారు. మరో వైపు ఏళ్లుగా సాగుతున్న ఎస్సీ వర్గీకరణ కు కమిటీ వేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు.

బీసీలకు రాజ్యాధికారం కావాలంటే బీజేపీని గెలిపించాలని ఆ అవకాశాన్ని తెలంగాణ ప్రజలకే వదిలేసింది. జాతీయ పార్టీగా ఇచ్చిన మాట బీజేపీ తప్పదు అనే నమ్మకం అయితే సామాన్య ప్రజల్లో ఉంది. ఎస్సీ వర్గీకరణ కు సానుకూలంగా స్పందించడంతో బీజేపీకి అండగా నిలవాలని మందకృష్ణ మాదిగ కోరారు. ఈ రెండు నిర్ణయాలు ఆయా వర్గాలను ప్రభావితం చేస్తే 25-30 సీట్లు వస్తాయని తద్వారా కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP

సంబంధిత వార్తలు: