బీజేపీ సక్సస్‌ సీక్రెట్‌ బయటపెట్టిన పీకే?

frame బీజేపీ సక్సస్‌ సీక్రెట్‌ బయటపెట్టిన పీకే?

ప్రశాంత్ కిషోర్ భారత దేశపు రాజకీయాల్లో పరిచయం అవసరం  లేని పేరు. ఆయన వ్యాఖ్యలకు, ఆయన చర్చలకు కూడా ఎంతో డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా ఏపీలో గత ఎలక్షన్లలో జగన్ మోహన్ రెడ్డి గెలిచారంటే దాని వెనకాల ఉన్న బలమైన కారణం ఈ ప్రశాంత్ కిషోర్ అని తెలుస్తుంది. ఇక వచ్చే ఏడాదిలో ఆంధ్రాలో  ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రశాంత్ కిషోర్ టీమే పని చేస్తుంది ఇప్పుడు.


అయితే  తాజాగా భారతీయ జనతా పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీలపై ఆయన ఒక వ్యాఖ్య చేశారన్నట్లుగా తెలుస్తుంది. భారతీయ జనతా పార్టీ కూటమిని ఓడించాలంటే కాంగ్రెస్ పార్టీ కూటమికి చాలా కష్టం అని ఆయన అన్నారు. దానికి ఆయన నాలుగు కారణాలు కూడా చెప్పారు. వాటిలో ఒకటి హిందుత్వం, రెండు జాతీయవాదం, మూడు లబ్ధిదారులకు నేరుగా సంక్షేమం అందించడం. దీనిలో మొదటి మూడింటిని కనుక కాంగ్రెస్ పార్టీ చేరుకోగలిగితే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీపై గెలుపు సాధించినట్లే.


కానీ ఈ క్రమంలోకి వచ్చేసరికి మొదటగా కాంగ్రెస్ పార్టీకి హిందుత్వం బేస్ లేదు. రెండోది జాతీయవాదం కూడా వర్తించదు. మూడవది లబ్ధిదారులకు నేరుగా నగదు అందించలేదు. అంటే డైరెక్ట్  బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ కూడా ఏమి చేయలేదు. అంటే ఇవేవీ కూడా కాంగ్రెస్ వాళ్లు చేయలేరు. ఇక నాలుగవది ఆర్థిక సంస్థాగతమైన పార్టీ బలం.


ఇదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్లకి కూడా ఉంది. కానీ మొదటి మూడు మాత్రం అందుకోగలిగితే భారతీయ జనతా పార్టీపై గెలుపు సాధిస్తారు అని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానం చేసినట్లుగా తెలుస్తుంది. అంటే భారతీయ జనతా పార్టీ విజయానికి మూలకాలైనటువంటి ఈ మూడింటినీ అందుకోగలిగితే  కాంగ్రెస్ విజయం సాధిస్తుంది అని ఆయన అంటున్నాడు. ప్రశాంత్ కిషోర్ ఇచ్చే సూచనలను రాజకీయ నాయకులు ఫాలో అవుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన చెప్పే సూచనలు సలహాలలో మ్యాటర్ ఉంటుంది కాబట్టి.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP

సంబంధిత వార్తలు: