జగన్.. అంతగా మేనేజ్ చేస్తున్నాడా?

రాజకీయాలను ఎలా వాడుకోవాలి.. అధికారాన్ని అడ్డుపెట్టుకొని వ్యవస్థలన్ని ఎలా మేనేజ్ చేయలనేది చంద్రబాబుకి తెలిసినంతగా మరే ఇతర నాయకుడికి తెలియదని టీడీపీ నేతలతో పాటు ప్రతిపక్షాలు అంటుంటారు.  ప్రశ్నిస్తే ఉక్కు పాదం.. విపక్షాల గొంతు నొక్కడం.. వారిని తెలివిగా బోల్తా కొట్టించడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్యని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు.  అందుకే ఇప్పటి వరకు చంద్రబాబుపై ఏ కేసు నిరూపితం కాలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే.. తమ నేత మచ్చలేని నాయకుడని టీడీపీ నేతలు గొప్పగా చెప్పుకుంటుంటారు.

తాజాగా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టుతో ఇవన్నీ తారుమారయ్యాయి.  ఆరు నెలల సాహవాసం చేస్తే వాళ్లు వీళ్లువుతారని పెద్దలు అంటుంటారు.  ఈ మాట ఎందుకంటే ఏపీలో జగన్ వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారని నారా లోకేశ్ వాదిస్తున్నారు.  తాజాగా ఎల్లో మీడియాలో సైతం ఓ ఆర్టికల్ లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఓ కాలాన్ని రాసుకొచ్చారు.

అదే నిజం అయితే జగన్ ఒక మెట్టు ఎదిగినట్లే.  ఎందుకంటే వ్యవస్థల్ని మేనేజ్ చేయడం వల్లే చంద్రబాబు అంత గొప్ప నాయకుడు అయ్యారు.  తన పై నమోదైన ఏ కేసు కూడా విచారణకు రాకుండానే స్టేలు తెచ్చుకుంటూ.. దానిని నిర్వీర్యం చేస్తారు.  ఎదుటి వారిపై మాత్రం కేసులు వేగంగా విచారణకు వస్తాయి.  వారు శిక్షలు అనుభవిస్తారు. జగన్ ను జైల్లో పెట్టడానికి చంద్రబాబు కూడా ఓ కారణం అని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటారు.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పడానికి వ్యవస్థల  మేనేజ్ మెంట్ కు ఎల్లో మీడియా అప్పట్లో తెరలేపింది.  మనకి సాగినంత  కాలం గొప్పగా చెప్పుకొని ఎదుటి వారు చేసే సమయానికి వారిపై ఆరోపణలు చేస్తూ సానుభూతి పొందే ప్రయత్నం టీడీపీ నేతలు చేస్తున్నారు.  అప్పుడు మేమేమీ వ్యవస్థల్ని మేనేజ్ చేయలేదంటే.. ఇప్పుడు జగన్ చేయలేదనే భావించాలి.  మేం అలా చేయలేదంటే నమ్మే స్థితిలో జనం లేరు.  కేవలం అధికారం చేతులు మారిందంతే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: