ఇజ్రాయెల్‌తో మోదీ డబుల్‌ గేమ్‌ ఆడుతున్నారా?

ఒక ముళ్ల కంపపై ఏదైనా దుస్తులు పడితే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే అది మన అవసరం. ప్రస్తుతం అంతర్జాతీయ ఉగ్రవాదంపై భారత్ పోరాటం చేస్తోంది. అయినా కొన్ని దేశాలు పరోక్షంగా ఉగ్రవాదానికి సహకరిస్తున్నాయి. కానీ చమురు దృష్ట్యా మనకి ఆయా దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి.  అదే సందర్భంలో మన దేశంలో ఉన్న మైనార్టీ ఓటు బ్యాంకు ను కాపాడుకునేందుకు కూడా వారితో సానుకూల వాతావరణం కలిగి ఉండాలి.


ఈ కారణంచేతనే ఓ వైపు ఇజ్రాయెల్ కు మద్దతు తెలుపుతూ పాలస్తీనా ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నారు. సాధారణ పౌరులు చనిపోవడానికి వీల్లేదు అంటాం కానీ.. హమాస్ తీవ్రవాదులకు ఎందుకు ఆశ్రయం ఇచ్చారు అని మనం ప్రశ్నించకూడదు. ఎందుకంటే ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో తల దూర్చడానికి ఏదేశానికి హక్కు లేదు. అలాగే హమాస్ తీవ్రవాదులకు అండగా ఉండే జోర్డాన్ తో కూడా ప్రధాని మోదీ ఫోన్ లో సంభాషించారు.


హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ నేపథ్యంలో అక్టోబరు 23న ప్రధాని మోదీ జోర్డాన్ కింగ్ అబ్దుల్లా తో పశ్చిమాసియా ప్రాంతంలోని పరిణామాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.  ఉగ్రవాదం, హింస, పౌరుల మరణాలపై ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు, మానవతావాద పరిస్థితిని పరిష్కరించడానికి అవసరమైన సమష్ఠి నిర్ణయాలపై మాట్లాడమని ప్రధాని ఎక్స్ వేదికగా తెలిపారు.


గాజాలో రాత్రి సమయంలో ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత వీరిద్దరి సంభాషణ నడిచింది. అంతకుముందు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ, అలాగే పాలస్తీనా అథారటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ తోనూ మోదీ ఫోన్ లో మాట్లాడారు. ఇజ్రాయెల్ కు అన్ని విధాలుగా అండగా ఉంటామని నెతన్యాహూతో చెప్పిన మోదీ.. గాజాలోని అల్ అహ్లీ ఆసుపత్రిలో మరణాలపై అబ్బాస్ తో మాట్లాడారు. పాలస్తీనా ప్రజలకు సహాయం పంపడం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యపై భారతదేశపు దీర్ఘకాల సూత్రప్రాయ వైఖరిని పునరుద్ఘాటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: