దారుణం.. హమాస్‌.. అంతపని చేస్తోందా?

హమాస్ తీవ్రవాదుల వద్ద పెద్ద ఎత్తున డ్రగ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గాజాలో ఉన్న వారికి ఎక్కువగా డ్రగ్స్ అలవాటు చేసి వారిలో శత్రుత్వ భావాజాలన్ని పెంచి కనిపిస్తే ఎవరినైనా చంపేయాలన్నా కసి పెంపొందిస్తున్నారు. ఇజ్రాయిల్ పైనే కాకుండా స్థానికుల మీద కూడా దాడులు చేస్తున్నారు. హమాస్ ఉగ్రవాదుల వల్ల ఎంతో మంది యువకులు డ్రగ్స్ కు బానిసై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యాలు చెడిపోయి నరకయాతన  అనుభవిస్తున్నారు.


హమాస్ ఉగ్రవాదుల వద్ద ఉన్న డ్రగ్స్ తీసుకుంటే సైకాలజికల్ గా దారుణమైన కిల్లర్ లుగా మారిపోతారని నిపుణులు చెబుతున్నారు. ఈ డ్రగ్స్ ఎక్కువగా ఇరాన్ నుంచి హమాస్ టెర్రరిస్టులకు వస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇరాన్ కు అఫ్గానిస్తాన్ నుంచి తీసుకుని వాడుతున్నారు. కొకైన్ లాగా ఆల్ ఇలైన్ అనే మత్తు మందు ను ఎక్కువగా వాడుతున్నారు. ఇస్లాం సంప్రదాయం ప్రకారం మత్తు పదార్థాలు తీసుకోరాదు.


కానీ అరబ్ కంట్రీలలో వీటిపై ప్రత్యేకంగా నిషేధం ఉంది. అరబ్ దేశస్థులు అసలు మత్తు మందులు తాగరు. కేవలం అరబ్ దేశాల్లో పని చేసే పాకిస్థాన్, ఇండియా వారు అనుమతి ఉన్న క్లబ్ లలో మాత్రమే మద్యం అమ్ముతారు. అక్కడ మాత్రమే మద్యాన్ని సేవించేందుకు అవకాశం ఉంది. కానీ ఇస్లాం సంప్రదాయాన్ని తుచ తప్పకుండా పాటించే వారు అరబ్ కంట్రీలకు చెందిన ముస్లింలు. వీరు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటారు.


కానీ ఇస్లాం మతాన్ని అడ్డుపెట్టుకుని హమాస్ ఉగ్రవాదులు మాత్రం పాలస్తీనా లోని గాజా ప్రాంతంలో విచ్చలవిడిగా డ్రగ్స్ యూత్ కు అలవాటు చేస్తూ వారి జీవితాలను నాశనం చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఇలా చేయడం వల్ల ఎదుటి వారిపై కోపం, పగతో రగలిపోయి తాము చెప్పినట్లు వింటారనే భావనలో ఉన్నారు. ఇది ఒకప్పటి లాగా కాకుండా తమను తామే దెబ్బతీసుకుంటున్నామనే విధానాన్ని హమాస్ గ్రహించలేకపోతుంది. తద్వారా ఘోరమైన తప్పిదాన్ని తమ దేశంలో యువతతో చేయిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: