పవన్‌ను అడ్డం పెట్టుకుని టీడీపీ గేమ్ ఆడుతోందా?
ఇక అప్పటి నుంచి బీజేపీతో దోస్తీలో ఉన్న పవన్ టీడీపీకి వారధిలా పనిచేస్తారని ప్రచారం కూడా నడిచింది. పవన్ కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం వాటికి బలాన్ని చేకూర్చాయి. ఎన్నికల నాటికి ఈ మూడు పార్టీలు కలిసి కూటమిలా ఏర్పడి వైసీపీ ని ఎదుర్కొంటాయి అని అందరూ భావించారు.
అయితే అనూహ్యంగా టీడీపీ అధినేత జైలుకు వెళ్లడందో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఊహించని విధంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ జైలులో చంద్రబాబుని కలిసి ఈ టీడీపీ, జనసేన కలిసే ఎన్నికలకు వెళ్తాయని ప్రకటించాడు. దీంతో బీజేపీ ఒక్కసారిగా అవాక్కైంది. దీనిపై బహిరంగంగా ప్రకటన చేయకున్నా తమతో సంప్రందింపులు జరపకుండానే పవన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పుడు బీజేపీలో ఉన్న సుజనాచౌదరి, ఆదినారాయణరెడ్డి, విష్ణుకుమార్ రాజు ఇతర నేతలు టీడీపీతో కలిసి వెళ్లాలని పార్టీ అధినాయకత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఆర్కే తో జరిగిన బిగ్ డిబేట్లో జగన్ తో బీజేపీకి ముప్పు అని.. డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు అని సుజనా వెల్లడించారు. జగన్ పాదయాత్ర సందర్భంలో అడ్డుకోవాలని అప్పటి సీఎం చంద్రబాబుకు సలహా ఇస్తే ఆయన తిరస్కరించారు. ఇది ఆయన తత్వం అని వ్యాఖ్యానించారు. త్వరలో దిల్లీ వెళ్లి అన్ని విషయాలు బీజీపీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఇప్పుడు చాలా చోట్ల ప్రస్తుత బీజేపీ నేతలు మళ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన తరఫున పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పుడు బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందో లేక వైసీపీని చేరదీసి టీడీపీని దెబ్బకొడుతుందో చూడాలి?