ఉద్యోగులను జగన్‌ ఎలా మేనేజ్‌ చేస్తాడో?

గత జనవరి 1 2004 నుండి భారత్ లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓ పి ఎస్ రద్దు చేయబడింది. కేంద్ర ప్రభుత్వం పెన్షన్ సంస్కరణల్లో భాగంగా పాత పెన్షన్ స్కీమ్ ను రద్దు చేయడం జరిగింది. అయితే ఈ పాత పెన్షన్ స్కీమ్ స్థానంలో నేషనల్ పెన్షన్ సిస్టం ఎన్ పీ ఎస్ అని పిలవబడే డిఫైన్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ అనే పథకాన్ని కొత్తగా తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం.


కంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ సి పి ఎస్ ని రద్దు చేస్తామని జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ప్రకటించింది. దాంతో ఉద్యోగులందరూ సి పి ఎస్ కి బదులుగా ఓ పి ఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీం ని తీసుకొస్తారని ఆశ పడ్డారు. అయితే వాళ్ల ఆశలకి, ఆలోచనలకి విరుద్ధంగా ప్రభుత్వం గ్యారంటీడ్ పెన్షన్ స్కీం జి పి ఎస్ ని తీసుకొచ్చింది.


అయితే ఉద్యోగులు ఈ జి పి ఎస్ కి ఒప్పుకుంటున్న సమయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుకూల మీడియా వాళ్లు తిరిగి రెచ్చగొడుతున్నారట. వాళ్లని ఓల్డ్ పెన్షన్ స్కీం డిమాండ్ చేయమంటూ  రెచ్చగొడుతున్నారట. దీంతో వాళ్ళందరూ ఇప్పుడు మళ్లీ  ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కోరుతున్నట్లుగా తెలుస్తుంది.


అయితే దీని గురించి సాక్షి మీడియా ఓ పీ ఎస్ ఇవ్వడం  సాధ్యం కాని పని అని వ్రాసుకొచ్చింది. అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు అమలులో ఉన్న నేషనల్ పెన్షన్ స్కీం నుండి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కి మారితే రాష్ట్రాలు అధోగతి పాలు అవుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నివేదికలో ఆందోళన చెందినట్లుగా కనిపిస్తుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఎన్ పి ఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ నుండి ఓ పి ఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కి మారుతామని ప్రకటించడంతో  ఆర్బిఐ ఈ విధంగా తెలిపిందని సాక్షి తన పత్రికలో వ్రాసుకొచ్చిందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: