ఆ పచ్చ పత్రికే చంద్రబాబు కొంపముంచుతోందా?
అయితే కంపెనీకి డబ్బులు చెల్లించే విషయంలో మరో కంపెనీకి చెల్లించామని తప్పు జరిగిపోయిందని మంత్రి బొత్స ఒప్పుకున్నాడు. దీనికి సంబంధించిన రూ.11 కోట్లు తిరిగి ఇచ్చేస్తామని ఏదైతే కంపెనీ ఉందో అది చెప్పింది. చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ విషయంలో సిమోన్స్ నిజమైన కంపెనీ కాదు. ఆయన్ని కావాలనే ఇరికించారు. చంద్రబాబు మోసపోయారు.
ఫేక్ కంపెనీ వల్ల అని చెబితే జనాలు కూడా నమ్మేవారు. బొత్స విషయంలో అదే జరిగింది. కానీ సిమోన్స్ కంపెనీ వారు 90 శాతం ఇవ్వలేరు. చంద్రబాబు మోసపోయారు. అన్యాయంగా కేసులో ఇరికించారు అని చెబితే ప్రజలు నమ్మేవారు. చుట్టు ఉన్న వారిని నమ్మడంతోనే చంద్రబాబు మోసపోయాడని చెబితే కాస్త న్యాయంగా అనిపించేది. కానీ ఎల్లో మీడియా మాత్రం అసలు తప్పు జరగనట్లు ప్రచారం చేసేస్తుంది. రూ. 3300 కోట్లు ఇస్తాడని చెప్పిన వారు ఇవ్వలేదు. దీనికి తోడు కూడా రూ.370 కోట్లు రిలీజ్ అయ్యాయి.
అయితే ఈ విషయంలో సీబీఐ దర్యాప్తుకు ఎల్లో మీడియా అడిగితే చంద్రబాబు ఏం తప్పు చేయకుంటే నిజాయతీగా బయటపడతాడు. కాబట్టి ఎల్లో మీడియా సీబీఐని కేసులో దర్యాప్తు చేయాలని ఎందుకు అడగడం లేదు. ఎందుకుంటే ఈ నిధులు పక్కాగా షెల్ కంపెనీలకు వెళ్లాయని తెలుసు కాబట్టే వీరు సీబీఐ దర్యాప్తును కోరుకోవడం లేదని వైసీపీ నేతలు, మేధావులు విమర్శలు చేస్తున్నారు.