'కోడి కత్తి'తో జగన్‌పై ఎల్లో మీడియా దాడి?

మార్గదర్శి కేసులో సీఐడీ ఇన్విస్టిగేషన్ చేస్తుంది. అయితే రామోజీకి సంబంధించిన మీడియా, టీడీపీ నాయకులు వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నాశనం చేస్తోంది ఇది సరైన విధానం కాదని కొందరు గగ్గోలు పెడుతున్నారు. కానీ అదే జగన్ విషయంలో ఏ దర్యాప్తు అయినా సరిగా జరగాలని కోరతారు. ఇదే ఆంధ్రలో జరుగుతున్న విచిత్రం.  

కోడి కత్తి కేసులో జగన్ ను పొడిచిన వ్యక్తి శ్రీను. తెలుగు దేశం పార్టీ కార్యకర్త అని అందరికీ తెలుసు. గతంలో శ్రీను కుటుంబం కూడా తెలుగు దేశంలో పార్టీలో ఉండేవారని తెలిసిందే. కానీ జగన్ ను పొడవడానికి వారం ముందు వైసీపీలో చేరినట్లు ఫ్లెక్సీ తయారు చేసుకున్నాడు. ఆ తర్వాత ఎయిర్ పోర్టులో జగన్ పై హత్యాయత్నం చేశాడు. అయితే ఇదంతా ఎల్లో మీడియాలో ప్రచారం చేయరు. వారికి కావాల్సింది మాత్రమే చేసుకుంటారు.

కోడి కత్తి కేసులో హైకోర్టులో విచారణకు జగన్ హాజరు కాలేనని చెప్పడం, లేదు హాజరు అయితేనే నిజనిజాలు తెలుస్తాయని శ్రీను తరఫు న్యాయవాదులు వాదించడం జరిగింది. అయితే శ్రీను తరఫు లాయర్ మాట్లాడుతూ.. జగన్ ను పొడిచేందుకు శ్రీను కు కోడికత్తి అందించింది మంత్రి బొత్స సత్యనారాయణ అల్లుడేనని వాదన పైకి తీసుకొచ్చారు. అయితే జగన్ పై దాడి జరిగిన సమయంలో అధికారంలో ఉన్నది టీడీపీ అని వారే మరిచిపోతున్నారు. అప్పుడు బొత్స సత్యనారాయణ అల్లుడు దాడి చేయిస్తే ఎందుకు అరెస్టు చేయలేదు. ఎందుకు అతనిపై కేసు పెట్టలేదు. అంటే ఇప్పుడు సరికొత్త నాటకానికి తెర లేపుతున్నారని తెలుస్తోంది.

దీన్ని ఆసరా చేసుకుని ఎల్లో మీడియా ప్రధాన పత్రికలో విష ప్రచారం చేయడం మొదలెట్టింది. జగన్ ను హత్య చేయాలనుకున్న కేసులో బొత్స అల్లుడు ఉన్నాడని తెగ ప్రచారం చేస్తున్నారు. పుంఖాను పుంఖాలుగా వార్తలు రాస్తున్నారు. నిజనిజాలు తెలుసుకోకుండా ప్రజలను తప్పు దోవ పట్టించేలా కథనాలు రాయడం కేవలం ఒక లాయర్ అన్న మాటతోనే కథనాలు ప్రచురించడం సరైంది కాదని తెలుసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: