బంపర్ ఆఫర్: చంద్రుడిపై స్థలం కొనేద్దామా..?
ఇంతవరకు బాగానే ఉంది. కానీ మనుషుల ప్రవర్తనలో మాత్రం సరికొత్త విధానాలు కనిపిస్తున్నాయి. అమెరికా అపోలో 13 విజయవంతం తర్వాత లూనార్ రిజిస్ట్రీ అని ఒక వెబ్ సైట్ తీసుకువచ్చింది. అందులో చంద్రమండలంపై భూమి కొనుగోలు చేయవచ్చని తెలిపింది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లాకు చెందిన సాయి విజ్ఞత అనే అమ్మాయి చంద్రుడిపై ఎకరం భూమి 2022లో కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఆగస్టు 23, 2023 నాడు పూర్తయింది. ఇప్పుడు ఇది పూర్తి వైరల్ గా మారింది.
చంద్ర మండలంపై ఎకరం భూమి దాదాపు 35 లక్షలకు కొనుగోలు చేసినట్లుగా రిజిస్ట్రేషన్ లో పేర్కొన్నారు దీంతో ఈ వార్త వైరల్ అవుతుంది. చంద్రమండలం పైన ఎవరికి హక్కు లేదని గతంలో చెప్పినప్పటికీ అమెరికా ఎకరం భూమికి 35 లక్షలు తీసుకొని ఎలా అమ్మిందని విమర్శలు వస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాకు చెందిన విజ్ఞత కూడా చంద్రుడిపై భూమి తన తల్లిదండ్రుల కోసమే కొన్నానని అది తన చిరకాల కోరిక అని ఆమె తెలపడం ఇక్కడ కొసమెరుపు.