ఆ నాయకుడి పెళ్లి.. పవన్‌ పై ఎల్లో మీడియా లొల్లి?

పవన్ ను పచ్చ మీడియానే కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఇరికిస్తారు. ప్రస్తుతం పవన్ అవసరాల రీత్యా టీడీపీనీ గానీ ఈనాడు, ఆంధ్రజ్యోతిని విమర్శించడం లేదు. గతంలో ఆంధ్రజ్యోతితో గొడవ జరిగిన విషయం తెలిసిందే. అయితే పవన్ తెలుగుదేశం మనిషి అనే వాదనను మెల్లిగా ప్రజల్లోకి తీసుకెళుతున్నారు.


ఇక తాజాగా వంగ వీటి రాధ పెళ్లి ఫిక్సయింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ జక్కం అమ్మాజీ బాబ్జీ దంపతుల కూతురు పుష్పవల్లితో పెళ్లి నిశ్చయమైంది. ముందుగా అనుకున్న ప్రకారం  ఆగస్టు 19 న నిశ్చితార్ధం, సెప్టెంబర్ 9న పెళ్లి జరగాల్సి ఉండగా..  నిశ్చితార్థం ఆగస్టు 28 కి వాయిదా పడింది. ఇది కొన్ని అనివార్య కారణాల వల్ల అని పెళ్లి కూతురు తండ్రి బాబ్జీ తెలిపారు. బాజ్జీ అమ్మాణీ టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే పనిచేశారని 2019 ఎన్నికల్లో మాత్రం జనసేన గూటికి వెళ్లారు.


అయితే ఇటీవల జరిగిన పవన్ వారాహి యాత్రలో జక్కం బాబ్జీ నివాసంలోనే బస చేశారు. అయితే వంగవీటి రాధకు కాబోయే భార్య ఒక కార్పొరేట్ విద్యాసంస్థలో ఓ విభాగానికి అధిపతిగా ఉన్నారని తెలుస్తోంది. రాధది తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేస్తూ గతంలో బాబ్జీ కూడా తెలుగుదేశం పార్టీ అనే గుర్తు చేస్తున్నారు. అంటే ప్రస్తుతం జనసేనలో ఉన్న వారు కూడా గతంలో టీడీపీ అని... ప్రస్తుతం వంగవీటి రాధ కూడా టీడీపీకి చెందిన వారే అని చెబుతూ చివరకు పవన్ కల్యాణ్ జనసేన పార్టీని చిన్నదిగా చేసి చూపడంలో విజయవంతం అవుతున్నారు.


అయితే దీన్ని పవన్ అంతగా గుర్తుంచుకోవడం లేదు. ఆయనకు కావాల్సింది మాత్రం ఆయన చేసుకుంటూ పోతున్నారు. ముఖ్యంగా టీడీపీ అవసరం ఆయనకు ఉందని అనుకుంటున్నారు. గతంలోనే జనసేన దెబ్బతింది ఈసారి అలా కాకుండా చూసుకోవాలని అనుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: