భారత్, చైనా సరిహద్దు చర్చలు సఫలమయ్యేనా?

భారత దేశానికి ప్రధాని మోడీ. అలాగే చైనాకి అధ్యక్షుడు జింపింగ్. వీరిద్దరూ కూడా ఒక విషయంలో ఒకే లక్షణాన్ని కలిగి ఉంటారు. అదే వారి మొండితనం విషయంలో. అలాగని వాళ్ళిద్దరూ పూర్తిగా ఒకే రకమైన పద్ధతి కలవాళ్ళు కాదు. నరేంద్ర మోడీ గురించి చెప్పాల్సి వస్తే ఒక పక్కన జనాలు విమర్శిస్తూనే ఉంటారు, మరో పక్కన గెలిపిస్తూనే ఉంటారు. ఎందుకంటే నరేంద్ర మోడీనే భారత దేశానికి పెద్ద దిక్కు.


ప్రపంచ దేశాలన్నీ భారత్ ను ఇప్పుడు గౌరవిస్తున్నాయి అంటే, భారత్ వైపు చూస్తున్నాయి అంటే దానికి కారణం మన ప్రధాని నరేంద్ర మోడీనే. అయితే ప్రపంచం అనేది మంచిని ఏ విధంగా అయితే ప్రత్యేకంగా చూస్తుందో, చెడును కూడా అదే విధంగా చేస్తుంది. ఆ రెండవ వర్గానికి చెందిన వాడే చైనా అధ్యక్షుడు జింపింగ్.  భారత్ లో నరేంద్ర మోడీని ప్రజలు ఎన్నుకుంటే,  చైనాలో మాత్రం ప్రజల చేత ఎన్నుకోబడని నాయకుడు జింపింగ్.


చైనాలో జింపింగ్ పాలన అనేది నిరంకుశత్వంతో నిండి ఉంటుంది. తనను పొగిడిన వాళ్ళని ఒకలా, తనను విమర్శించిన వాళ్ళని ఒకలా డీల్  చేసుకువస్తాడు జింపింగ్.  ఎవరైనా తనను విమర్శించారు అంటే వాళ్లకి ఆయన చేతిలో మరణ దండనే. తన ప్రభుత్వంలోని నాయకులైనా సరే తనను విమర్శిస్తే చంపి పడేస్తాడాయన. ఇలా ఇద్దరు కూడా ఎవరి పద్ధతిలో వాళ్ళు బలంగానే ఉంటారు.


ఇప్పుడు భారత్ చైనా సంఘర్షణకు తెర పడాలంటే ఈ దేశాల నాయకులిద్దరూ కలిసి కూర్చుని మాట్లాడాలని రాజకీయ నిపుణులు చెబుతున్న మాట. గాల్వన్ లోయ వివాదాన్ని వెనకుండి నడిపిస్తుంది ఈ జింపింగే అని అంటారు. అయితే త్వరలో జి20 సమావేశాలు జరగనున్నాయని తెలుస్తుంది. ఈ సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతుంది. అయితే ఈ సమావేశాలకు ముందే భారత్ ఇంకా చైనా అధ్యక్షులు ఇద్దరూ కూర్చుని ఒక శిఖరాగ్ర  సమావేశం ద్వారా ఒక నిర్ణయానికి రావాలని బలంగా కోరుకుంటున్నారు జనం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: