జగన్ విశాఖ పంతం నెరవేరుతుందా?
న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, పాలన వ్యవస్థ ఒక దగ్గరికి చేర్చే పని లో పడ్డట్లే తెలుస్తోంది. విశాఖలో పవన్, చంద్రబాబు ఇద్దరు విశాఖకు రాజధాని వద్దంటున్నారని అయినా అమరావతి కాదని సీఎం జగన్ కావాలనే విశాఖను రాజధాని చేయాలని చూస్తున్నారని అన్నారు. అయితే రాయలసీమ వారికి విశాఖ రాజధానిగా ఉండటం ఇష్టం లేదు. కానీ అదే సమయంలో ఆంధ్రలో ఉన్న అమరావతి ని కూడా రాజధానిగా ఇష్టపడటం లేదు.
అయితే అల్రడీ డెవలప్డ్ సిటీగా ఉన్న విశాఖను రాజధానిగా చేసుకుని పాలన చేస్తే అక్కడ నుంచి తొందరగా మెరుగైన రాజధానిగా నిర్మించుకోవచ్చని సీఎం జగన్ భావిస్తున్నారు. అయితే రిషికొండలో జరుగుతున్న నిర్మాణాన్ని అడ్డుకోవాలని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. అయితే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్ పాలన వికేంద్రీకరణే మా నినాదం అని అన్నారు. అంటే విశాఖను రాజధానిగా చేయడానికి ఇక్కడి నుంచే పాలన కొనసాగించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
కానీ దీనికి పర్యావరణం, అమరావతి రాజధాని అంశాన్ని చూపి వివిధ రకాలుగా ఇబ్బందులు పెట్టడానికి టీడీపీ, జనసేన ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే రాజధాని విషయంలో సీఎం జగన్ అధికార ప్రభుత్వానికి కోర్టుల్లో ఎదురు దెబ్బలే తగిలాయి. మరి విశాఖ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు, కోర్టుల్లో వేేసే కేసులకు సంబంధించి ఎలా ముందుకు సాగుతారో చూడాలి. అమరావతి రాజధానిగా ఉండాలని టీడీపీ, విశాఖ రాజధాని అయితేనే తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేసుకోవచ్చని జగన్ మంకు పట్టు పట్టారు. మరి ఈ విషయంలో ప్రజలు ఎవరికి మద్దతు తెలుపుతారో వచ్చే ఎన్నికల్లో తేలిపోనుంది.