బండి సంజయ్‌ను తీసేశాక బీజేపీ ఊపు తగ్గిపోయిందా?
ఆ సందర్భంలోనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లారు. మిగిలిన వాళ్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అప్పుడు సీట్లు లేక ఆగిపోయిన పరిస్థితి ఏర్పడింది. అలా ఆగిపోయిన వ్యక్తి చంద్ర శేఖర్ ఆ మధ్యన బీజేపీలో చేరినట్లుగా తెలుస్తుంది. తెలుగు దేశం పార్టీకి సంబంధించిన చంద్ర శేఖర్ వికారాబాద్ కి సంబంధించి గతంలో మంత్రిగా పని చేసారని తెలుస్తుంది. అయితే ఇప్పటికే భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు ఈటెల రాజేందర్.
బిజెపి కూడా బండి సంజయ్ ను పక్కన పెట్టి మరీ ఈటెల రాజేందర్ చేతిలో పార్టీ రాష్ట్ర స్థాయి బాధ్యతలను పెట్టింది. అయితే ఆల్రెడీ బిజెపిలో చేరిన చంద్ర శేఖర్ పార్టీలో ఈటెల రాజేందర్ కే ప్రాముఖ్యత ఇచ్చి తనను పట్టించుకోవడం లేదని చాన్నాళ్లుగా మదన పడుతున్నారని అంటున్నారు. ఇప్పుడు ఇదే మాటను నిజం చేస్తూ చంద్ర శేఖర్ బిజెపి కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.
ఈటెల రాజేందర్ కూడా చంద్ర శేఖర్ కి ఎంత చెప్పి చూసినా ఆయన వినలేదని అంటున్నారు. మొత్తానికి చంద్ర శేఖర్ తెలంగాణ బిజెపికి షాక్ ఇచ్చారని తెలుస్తుంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించి అసంతృప్తిగా ఉన్న నాయకులను తన వైపుగా తిప్పుకునే పనిలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవుతుంది.