మోదీని కలవనున్న చంద్రబాబు.. మాస్టర్ ప్లాన్ ఇదే?
అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఆర్థిక నిందితుడు అనడానికి బదులుగా ఆర్థిక నేరస్తుడు అని పిలవడం తెలుగు దేశం వాళ్ళకే చెల్లింది. అయితే ఆ తర్వాత ఎన్డీఏ నుండి బయటకు వచ్చేసే సమయంలో తెలుగు దేశం పార్టీ తన మనసులోని మాటనే బయట పెట్టింది జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా అపాయింట్మెంట్ ఇస్తారు అని. అయితే ఇప్పుడు కాయిన్ తిరగబడింది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడి హోదాలో చంద్రబాబు నాయుడు ఉన్నారు.
అయితే ఆయనకి కూడా మోడీ ఇప్పటివరకు రెండు సార్లు పర్మిషన్ ఇచ్చారు. చంద్రబాబుతో పాటు రామ్మోహన్ నాయుడుకి కూడా కేంద్రం అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు విమర్శించిన విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా కేంద్రాన్ని ప్రశ్నించలేదు. ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేంద్రంతో సంబంధాలు ఉన్నాయి.
అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే ఇప్పుడు మరొకసారి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ అప్రోచ్మెంట్ వేరు. పుంగనూరులోనూ అలాగే అంగళ్లూరులోనూ చంద్రబాబు నాయుడుని హత్య చేయడానికి వైసిపి శ్రేణులు ప్లాన్ చేశాయని చంద్రబాబు నాయుడు కేంద్రం దగ్గరికి వెళ్తున్నారు. మరి ఈసారి కనుక కేంద్రం అపాయింట్మెంట్ ఇస్తే ఓకే కానీ ఇవ్వకపోతే టిడిపి వేరేలా అనుకుంటుంది.