పురందేశ్వరిపై వైసీపీ కులం ముద్ర.. కరెక్టేనా?

బీజేపీ గత అధ్యక్షుడు సోము వీర్రాజు మీద టీడీపీ, జనసేన పార్టీ వారు వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉంటారని ముద్ర వేశారు. వైసీపీ వ్యతిరేకంగా చేసిన విమర్శలను ప్రదర్శిస్తూ, తెలుగు దేశం చేసిన విమర్శల్ని మాత్రం ప్రచారం చేసే వారు కాదు. అయితే సాక్షిలో ఏదైనా ప్రచారం అయితే దాన్ని చూపిస్తూ ఆయన వైసీపీ మనిషి, వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని ముద్ర వేశారు.

ఇప్పుడు పురందేశ్వరీ మీద వైసీపీ నాయకులు చంద్రబాబు టీడీపీ నాయకురాలు అనుకూలం  అంటూ ముద్ర వేస్తున్నారు.  మొన్నటి వరకు సైలెంట్ ఉన్న విజయసాయి రెడ్డి వరుస బెట్టి పోస్టులు  చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రులతో పాటు వైవీ సుబ్బారెడ్డి లాంటి వాళ్లు బీజేపీ అధ్యక్షురాలిని టార్గెట్ చేస్తున్నారు.

అయితే కేంద్ర ప్రభుత్వంలో పెట్టే బిల్లులకు వైసీపీ ఒక వైపు మద్దతిస్తూనే మరో వైపు బీజేపీ అధ్యక్షురాలైన పురందేశ్వరీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ పార్టీ టీడీపీకి అనుకూలం పురందేశ్వరీ అని అంటూ తెగ ప్రచారం చేస్తున్నారు.  ఇలా చేయడానికి ప్రధాన కారణం వైసీపీ పార్టీ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని జగన్ ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తోందని ఆమె విమర్శించడం. దీంతో ఏకధాటిగా వైసీపీ మంత్రులు, విజయసాయిరెడ్డి లాంటి వారు పురందేశ్వరీపై  విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

కేంద్రంలో దోస్తీ, రాష్ట్రంలో కుస్తీ విధానాన్ని రెండు పార్టీలు పాటిస్తున్నాయి. ఇది స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో సోము వీర్రాజు, కన్నా లక్ష్మినారాయణకు రానీ ప్రాధాన్యత టీడీపీ అనుకూల మీడియాలో పురందేశ్వరీకి కనిపిస్తోంది. దీని వెనక కచ్చితంగా చంద్రబాబు ఉన్నారనే వైసీపీ మంత్రులు ఆరోపిస్తున్నారు. అయితే టీడీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు మీద ఆగ్రహాన్ని వైసీపీ నాయకులు పురందేశ్వరీపై చూపిస్తున్నారు. కానీ టీడీపీ, వైసీపీలే ఆంధ్రలో అసలైన ప్రత్యర్థులు అని రాబోయే ఎన్నికల్లో రెండు పార్టీల మధ్యే పోటీ ఉంటుందని తెలుసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: