కేరళలో కొత్త ఉద్యమం.. దేశానికే ప్రమాదమా?

పాతబస్తీలో ఓట్లను నియోజవకర్గాల పునర్విభజనలో ముస్లింల ఓట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ఒక్కచోట చేర్చి ఎంఐఎం పార్టీకి అనుకూలంగా మార్చేలా కాంగ్రెస్ పార్టీ వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఒక వర్గం ఆధిపత్యంలోకి రావవడంతో చివరకు ఆ పని చేసిన కాంగ్రెస్ కూడా అక్కడ గెలవడం లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీలు ఏవీ గెలవని పరిస్థితి.

తాజాగా కేరళలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చేసింది. గోవు మాంసం తినే వారు కాంగ్రెస్ లో చేరాలని పెద్ద పెద్ద బోర్డులు పెడుతున్నారు. కేరళలో భారత దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముస్లిం దేశం కావాలని ఐయూఎంఎల్ లాంటి వారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బహిరంగంగానే మాట్లాడారు. దేశాన్ని విడదీయాలని నినాదాలు చేస్తూ ర్యాలీ తీశారు. దాదాపు అక్కడ 300 మంది మీద దీనిపై కేసు పెట్టారు.

ఈశాన్యం, కాశ్మీరం, కేరళ, పశ్చిమ బెంగాల్, లాంటి ప్రాంతాల్లో దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వారిని కట్టడి చేయకపోతే రేపటి రోజున ప్రతి ప్రాంతంలో ఇలాంటి అలజడులు రేపేందుకు సిద్ధంగా ఉంటారు. ఇది పంజాబ్ దాకా పాకి అక్కడ విధ్వంసాలకు ఖలిస్తాన్ వేర్పాటు వాదులకు అడ్డాగా మారిపోయింది.ఇలాంటి దేశానికి వ్యతిరేకంగా ఘటనలు అనేవి రోజు ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉంటాయి. వాటిని మొగ్గలోనే తుంచేయకపోతే అవి పెరిగి పెద్దయి తీవ్ర మైన పరిణామాలకు దారి తీస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

అసలు కేరళలో జరిగిన ర్యాలీలో ఎవరెవరూ పాల్గొన్నారు. వీరు ఇలాంటి నిరసన ర్యాలీ చేయడానికి అనుమతి ఎవరు ఇచ్చారు. ఈ ర్యాలీ వెనక ఉన్న రాజకీయ నాయకుడు ఎవరు? దీని వెనక ఉన్న రాజకీయ పార్టీ ఏదైనా ఉందా? యువతను రెచ్చగొట్టి దేశానికి వ్యతిరేకంగా ర్యాలీ చేయించడం వెనక ఉన్న వారిని పట్టుకోవాలి. మరో సారి ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠినంగా శిక్షలు అమలు చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: