పాపం శ్రీనివాస్.. జగన్ కోడికత్తి కేసు తేలేదెన్నడో?
ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఎయిర్ పోర్టులోనే జగన్ పై దాడి చేసిన హత్యాయత్నం కేసులో శ్రీనివాస్ ప్రధాన నిందితుడు. అతడికి ఇంకా బెయిల్ రాలేదు. కానీ కేవలం శ్రీనివాస్ ఒక్కడు ఇది చేయలేదు. టీడీపీ వాళ్ల హస్తం ఉందని వైసీపీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. శ్రీనివాస్ వెనక ఉన్న వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
జగన్ తదనంతరం జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేతపై విశాఖ ఎయిర్ పోర్టులో అత్యంత సెక్యూరిటీ ఉండే ప్రాంతంలో దాడి జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కాబట్టి ఎయిర్ పోర్టులోకి కోడి కత్తి ఎలా తీసుకురాగలిగారు. నెల్ కట్టర్ లాంటి వాటిని ఎలా తీసుకొచ్చారు. దీని వెనక పెద్దల హస్తం ఉందని ఆరోపిస్తున్నారు.
కానీ ఎన్ఐఏ కోర్టు మాత్రం జగన్ వేసిన పిటిషన్ ను కొట్టి వేయడంతో వైసీపీ నాయకులు కంగుతిన్నారు. ఈ విషయంలో దర్యాప్తు కోసం మరింత ముందుకు వెళతారా? లేదా అనేది చూడాలి. కానీ జగన్ పై దాడి జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం మార్పులు వచ్చాయి. వైసీపీ లీడర్లు క్షేత్ర స్థాయిలో కి వెళ్లి జగన్ ను హత్య చేయాలని ప్రయత్నం చేశారని ముమ్మరంగా ప్రచారం చేయడం సానుభూతి కలగడంతో విజయం సాధ్యమైంది.