ఇన్స్టాగ్రామ్ ద్వారా భారీగా సంపాదిస్తున్న విష్ణు ప్రియ..?

Divya
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు యాంకర్స్, యూట్యూబర్స్ బాగా ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా సబ్ స్క్రిప్షన్ ప్లాన్ తో ఎక్స్ క్లూజివ్ కంటెంట్ అంటూ రోజురోజుకి సబ్స్క్రైబర్లను పెంచుకునే పనిలో పడ్డారు. అందులో గ్లామర్ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ భారీగానే సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో మొదటి వరుసలో ఉంది యాంకర్ విష్ణు ప్రియ. ఈ పద్ధతిని తీసుకువచ్చిందే విష్ణు ప్రియనే. ఆ తర్వాత అషు రెడ్డి, అనన్య నాగళ్ళ, సిరి ఇలా చాలామంది ఇంస్టాగ్రామ్ పెయిడ్ సబ్ స్క్రిప్షన్ ని మొదలుపెట్టారు.


అయితే వీరందరిలో కూడా ఎక్కువగా విష్ణుప్రియ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవల తాను చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పోస్టులతో తరచూ ఏదో ఒక వివాదాలలో ఈమె పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ కాంట్రవర్సీలే తనకు ఆదాయంగా మారినట్టు కనిపిస్తోంది. గత కొద్ది రోజుల నుంచి విష్ణు ప్రియ ఇంస్టాగ్రామ్ సబ్స్క్రైబర్స్ ఒక్కసారిగా పెరిగినట్లు సమాచారం. విష్ణు ప్రియ ను ఫాలో అవుతున్న వారి సంఖ్య విషయానికి వస్తే 7,400 పైగా చేరినట్లు తెలుస్తోంది. విష్ణు ప్రియ సబ్స్క్రిప్షన్ నెలకు రూ.390 ఫిక్స్ చేసింది.


ఆ లెక్కన ప్రస్తుతం ఉన్న సబ్ స్క్రైబర్స్ ప్రకారం చూస్తే ప్రతినెల ఈమెకు సుమారుగా రూ .25 లక్షల రూపాయలకు పైగా ఆదాయం వస్తున్నట్లు సమాచారం. ఒక సాధారణ యాంకర్ సోషల్ మీడియా ద్వారా ఈ రేంజ్ లో ఆదాయం అంటే అందరికీ ఆశ్చర్యమే. విష్ణు ప్రియ అప్పుడప్పుడు పలు రకాల ప్రైవేట్ ఆల్బమ్లలో కూడా కనిపిస్తోంది. అయితే సినిమా అవకాశాలు యాంకర్ గా అవకాశాలు మాత్రం అందుకోవడం లేదు. మరి రాబోయే రోజుల్లో సినిమా అవకాశాలు గాని యాంకర్ గా గాని మళ్లీ తిరిగి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో తనమీద జరుగుతున్న నెగిటివ్ పై ఎప్పటికప్పుడు కౌంటర్స్ వేస్తూనే ఉంటుంది విష్ణు ప్రియ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: